వారంలో ఒక్క‌సారి ఈ రెమిడీని ట్రై చేస్తే జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతుంది!

కురులు ఒత్తుగా, పొడ‌వుగా ఉంటే ఆడ‌వారి అందం మ‌రింత రెట్టింపు అవుతుంది.కానీ, ఇటీవ‌ల రోజుల్లో పోష‌కాల కొర‌త‌, కాలుష్యం, ఆహార‌పు అలవాట్లు, ఒత్తిడి వంటి వివిధ కార‌ణాల వ‌ల్ల చాలా మందిలో హెయిర్ గ్రోత్ స‌రిగ్గా ఉండ‌టం లేదు.

 Simple Home Remedy For Hair Growth , Home Remedy . Hair Growth . Latest News ,-TeluguStop.com

దీంతో కొంద‌రు హెయిర్ గ్రోత్ పెంచుకునేందుకు మందులు వాడుతుంటారు.అలాగే ఖ‌రీదైన షాంపూలు, ఆయిల్స్ కొనుగోలు చేసి యూజ్ చేస్తారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని వారంలో ఒకే ఒక్క‌సారి ట్రై చేస్తే గ‌నుక వ‌ద్ద‌న్నా మీ జుట్టు సూప‌ర్‌గా పెరుగుతుంది.

మ‌రి హెయిర్ గ్రోత్‌ను ఇంప్రూవ్ చేసే ఆ రెమెడీ ఏంటో.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో.? లేట్ చేయ‌కుండా ఓ చూపు చూసేయండి.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాట‌ర్‌ పోయాలి.వాట‌ర్ కాస్త హీట్ అవ్వ‌గానే అందులో రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ పొడి, ఒక స్పూన్ మెంతుల పొడి వేసి ప‌ది నిమిషాల పాటు బాగా మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి.

ఇప్పుడు వాట‌ర్‌ను మాత్రం ఫిల్ట‌ర్ చేసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఆముదం క‌లిపి స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి.ఆపై జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు త‌యారు చేసుకున్న వాట‌ర్‌ను స్ప్రే చేసుకుని గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం మైల్డ్ షాంపూను యూజ్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఇలా వారానికి ఒక సారి చేయ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

చుండ్రు స‌మ‌స్య ఉంటే దూరం అవుతుంది.ఆయిలీ హెయిర్ నుంచి విముక్తి ల‌భిస్తుంది.

మ‌రియు కురులు ఎల్ల‌ప్పుడూ ప‌ట్టులా మెరిసి పోతుంటాయి.ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబ‌ట్టి పైన చెప్పిన సింపుల్ అండ్ ఎఫెక్టివ్‌ రెమెడీని ఖ‌చ్చితంగా ట్రై చేయండి.

Simple Home Remedy For Hair Growth , Home Remedy . Hair Growth . Latest News , Hair Care , Hair Care Tips , Long Hair , Hair , Shampoos , Oils - Telugu Care, Care Tips, Remedy Latest, Long, Oils, Shampoos

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube