పోలీసులపై టీడీపీ నాయకురాలు అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.రుషి కొండ వద్ద నిరసన తెలియజేయడానికి వెళ్తే మా పార్టీ నేతలను నిర్బంధం చేస్తారా అని ప్రశ్నించారు.
పోలీసులు నేమ్ ప్లేట్స్ లేకుండా డ్యూటీ చేస్తున్నారంటూ విమర్శించారు.ప్రతిపక్ష నాయకుల దగ్గర పోలీసులు కాపలా కాస్తుంటే నగరంలో క్రైమ్ రేటు ఎందుకు తగ్గుతుందని అన్నారు.
రుషికొండ వద్ద ఎలాంటి అక్రమాలు జరగకపోతే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.అరెస్ట్ లు, గృహా నిర్బంధాలు చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎవరినీ విడిచిపెట్టమంటూ హెచ్చరించారు.