టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ కాంబినేషన్లలో నాగచైతన్య( Naga Chaitanya ) సాయిపల్లవి( Sai Pallavi ) కాంబినేషన్ కూడా ఒకటని చెప్పడంలో సందేహం అవసరం లేదు.ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ కాంబోలో తెరకెక్కిన తండేల్ మూవీ( Thandel Movie ) మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద 35 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వస్తే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ గా నిలిచే అవకాశం అయితే ఉంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
ఈ సినిమా ఔట్ పుట్ చూసిన అల్లు అరవింద్( Allu Aravind ) రియాక్షన్ గురించి బన్నీవాస్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.అల్లు యూనివర్సిటీ డీన్ అల్లు అరవింద్ గారు సినిమా ఔట్ పుట్ ను సర్టిఫై చేశారని డిస్టింక్షన్ లో పాస్ అయిపోయామని పేర్కొన్నారు.
గీతా ఆర్ట్స్ ట్విట్టర్ పేజ్ ఆ పోస్ట్ కు రిప్లై ఇస్తూ అల్లు అరవింద్ గారు 100 మార్కులు వేశారని థియేటర్ లో తండేల్ మూవీ దుల్లగొట్టేయాల్సిందేనని ఇక రాజులమ్మ జాతరే అంటూ శ్రీకాకుళం యాసలో చెప్పుకొచ్చారు.అల్లు అరవింద్ కాన్ఫిడెంట్ గా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తండేల్ ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.తండేల్ సినిమాకు పెద్దగా పోటీ కూడా లేకపోవడం గమనార్హం.సంక్రాంతి సీజన్ ను మిస్ చేసుకున్న తండేల్ ట్రైలర్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.2025 బిగ్గెస్ట్ హిట్లలో తండేల్ ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.లవ్ స్టోరీ మ్యాజిక్ రిపీట్ కావడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.