బెంగళూరు నగరంలో( Bengaluru ) ఓ దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ మహిళ ఇంట్లో గీజర్( Geyser ) రిపేర్ చేయడానికి వెళ్లిన వ్యక్తి, ఆమె స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్( Blackmail ) చేయడం సంచలనం రేపింది.
గీజర్ లో రహస్యంగా కెమెరా పెట్టి, ఆ వీడియోలతో బాధితురాలిని బెదిరించడం మొదలుపెట్టాడు.
అయితే ఆ దుర్మార్గుడు ఇలాంటి నీచుపు పనులు చేస్తే తెలివిగా తప్పించుకోవాలనుకున్నాడు.
అతడు పారిపోతుండగా ఒక మంచి వ్యక్తి అతన్ని వెంబడించి పట్టుకున్నాడు.పోలీసులకు అప్పగించి, ఆ మహిళ చేత చెప్పుతో కొట్టించాడు కూడా.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘కర్ణాటక పోర్ట్‌ఫోలియో‘ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.అంతేకాదు, ఉద్యోగాలను అడ్డం పెట్టుకుని ఇలాంటి నీచమైన పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ వ్యక్తి డిమాండ్ చేశాడు.
అయితే, గీజర్ లోపల వేడిని కెమెరా( Camera ) ఎలా తట్టుకుంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.విచారణలో ఆ మహిళ, ఆ టెక్నీషియన్ గతంలో ప్రేమించుకున్నారని తేలింది.వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు ఆ మహిళ తన ప్రైవేట్ ఫోటోలు అతనికి పంపిందట.
బంధం బయటపడటంతో, తన పరువు పోతుందని భయపడిన ఆ మహిళ.ఆ ఫోటోలు ఎలా వచ్చాయో తనకు తెలియదని, ఆ టెక్నీషియనే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని భర్తకు, ఇతరులకు చెప్పింది.చివరికి, ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోలేదు.అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్ లో పంచాయితీ జరిగి, విషయం సద్దుమణిగింది.
మొత్తానికి బ్లాక్ మెయిల్ కేసు అనుకున్నది కాస్తా.వ్యక్తిగత వ్యవహారంగా మారిపోయింది.
సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఈ ఘటనకు తెరపడింది.ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఏది ఏమైనా టెక్నీషియన్లు( Technician ) బాత్రూంలో కెమెరాలు పెట్టే ప్రమాదం ఉందని, ఈ ఘటనలో అలా జరకకపోయినా మహిళలు జాగ్రత్తగా ఉండాలని చాలామంది నెటిజన్లు సలహా ఇస్తున్నారు.ఇలాంటి వీడియోలను అందరితో షేర్ చేసుకోవాలని కోరుతున్నారు.