అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.ఈ లిస్ట్‌లో పలువురు భారతీయులు కూడా ఉండగా.
వీరిని పలు విడతలుగా అమెరికా నుంచి భారత్‌కు తరలించారు.ఏజెంట్లను నమ్మి తాము మోసపోయామంటూ తిరిగొచ్చిన వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
అలా ఒక్కొక్కరిది ఒక్కో గాథ.అప్పులు చేసి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమెరికాలో అడుగుపెట్టగా.ట్రంప్ ప్రభుత్వం వీరందరినీ అమెరికా నుంచి బహిష్కరించడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్ధితుల్లో ఉన్నారు బాధితులు.

ఏజెంట్ల భరతం పట్టేందుకు పంజాబ్ ప్రభుత్వం సిట్‌ను( Punjab government forms SIT ) నియమించగా.ఇప్పటికే పలువురిని అరెస్ట్ కూడా చేసింది.అయితే బాధితులను ఇప్పుడో కొత్త సమస్య వేధిస్తోంది.
అదే పోలీసుల ఉదాసీనత.గత నెలలో అమెరికా నుంచి బహిష్కరించబడిన 131 మంది పంజాబీలలో ఇప్పటి వరకు 23 మంది మాత్రమే తమ ట్రావెల్ ఏజెంట్లపై కేసులు నమోదు చేశారు.
అయితే ఆప్ ప్రభుత్వం, మంత్రులు, అధికారులు, పోలీసులు.ట్రావెల్ ఏజెంట్లపై( travel agents ) ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు కనీసం మా ఫోన్ కాల్స్‌కు కూడా స్పందించడం లేదని మండిపడుతున్నారు.అయితే అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వారి కేసులలో దర్యాప్తును వేగవంతం చేయాలని రాష్ట్రంలోని ఎస్ఎస్‌పీలు/సీపీలను సిట్‌కు సారథ్యం వహిస్తున్న పంజాబ్ ఏడీజీపీ ఆదేశించారు.

సిట్ డేటా ప్రకారం.23 ఎఫ్ఐఆర్‌లలో ఇప్పటి వరకు నలుగురిని మాత్రమే అరెస్ట్ చేశారు.కేసులు పెట్టిన వారిలో కొందరికి ఏజెంట్లు డబ్బు చెల్లించడంతో వాటిని ఉపసంహరించుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి.దీంతో పంజాబ్ పోలీసులు కూడా ఇబ్బందికర పరిస్ధితుల్లో ఉన్నారు.ఫిర్యాదు చేసిన 23 మంది బాధితులు .తమను అమెరికా చేర్చడానికి ఏజెంట్లు ఎలాంటి ఏర్పాట్లు చేసింది ప్రస్తావించారు.అయితే విదేశాల్లో ఉన్న వేరే గ్యాంగ్‌లు, ఏజెంట్ల గురించి తెలుసుకోవడానికి పోలీసులకు ఈ సమాచారం సరిపోవడం లేదు.తమ అమెరికా కలను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ ఏజెంట్‌కు రూ.40 నుంచి రూ.60 లక్షల వరకు చెల్లించారు.మూడు నుంచి ఏడాది పాటు ప్రయాణించి అమెరికా చేరుకున్నప్పటికీ వీరంతా బహిష్కరణకు గురయ్యారు.ప్రాథమిక డేటా ప్రకారం పంజాబ్‌కు చెందిన వారు ఏజెంట్లకు దాదాపు రూ.44.70 కోట్లు చెల్లించారు.







