ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఓ వీడియో షేర్ చేస్తోంది.ఇందులో రాట్‌వీలర్( Rottweiler ) జాతి కుక్క నాగుపాముతో( Cobra ) భీకరంగా పోరాడుతోంది.@lone_wolf_warrior27 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 5 కోట్ల 90 లక్షల మందికి పైగా చూసేశారు.అంతేకాదు, దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ కూడా నడుస్తోంది.
ఆ వీడియోలో ఒక తోటలో శక్తివంతమైన రాట్‌వీలర్, విషపూరితమైన నాగుపాము ఎదురెదురుగా నిలబడ్డాయి.రాట్‌వీలర్ గట్టిగా మొరుగుతూ, బుసలు కొడుతున్న పాముపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది.
యజమాని కుక్కను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నా అది ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.ఆ సీనంతా యజమాని వీడియో తీస్తూ ఉండటం గమనార్హం.
క్షణాల్లోనే కుక్క ఒక్కసారిగా నాగుపాముపై దూకింది.అంతే, రెచ్చిపోయిన రాట్‌వీలర్ పామును పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది.
ఆ తర్వాత రాట్‌వీలర్ ఒక్క కాటుతో నాగుపాము తలను మొండెం నుంచి వేరు చేసింది.అంతేకాదు, ఆ తలను నోట కరుచుకుని మరింత చిద్రం చేసింది.
ఈ సీన్ చూస్తే ఎవరికైనా షాక్ రావడం ఖాయం.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.కొందరు కుక్క ధైర్యాన్ని( Brave Dog ) మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతుంటే, మరికొందరు పాముకు జరిగిన దారుణానికి బాధపడుతున్నారు.యజమాని జోక్యం చేసుకుని ఆ పోరాటాన్ని ఆపాల్సింది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
“నీ కుక్కకు కనీసం శిక్షణ కూడా ఇవ్వలేదా? నువ్వు చెప్పిన మాట కూడా వినడం లేదు” అని ఒక యూజర్ యజమానిపై విమర్శలు గుప్పించాడు.ఇంకొకరు పాము తరపున వాదిస్తూ “నాగుపాములు అంత త్వరగా దాడి చేయవు.
అవి ముందు హెచ్చరిస్తాయి లేదా విషం లేని కాటు వేస్తాయి.ప్రమాదకరమైన కట్లపాములను కూడా ఇవి తింటాయి.” అని చెప్పుకొచ్చారు.
పామును ఎవరూ కాపాడలేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.“మీరు వెంటనే రెస్క్యూ టీమ్‌కు ఫోన్ చేయాల్సింది” అని ఒక యూజర్ కామెంట్ పెట్టారు.కుక్క భద్రత గురించి కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.పాము కాటు వెంటనే జరగకపోయినా, దాని విషం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.“ఇది కుక్కకు ప్రాణాంతకం కూడా కావచ్చు.యజమాని వెంటనే స్పందించాల్సింది.” అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.
కొందరు ఈ పోరాటాన్ని కొనసాగనివ్వడంపై నైతికపరమైన ప్రశ్నలు కూడా లేవనెత్తారు.“ఇది చాలా బాధాకరం.అడవి జంతువులను ఇలా చూడకూడదు” అని ఒక యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.