ఇటీవల కాలంలో ఒక వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.ట్విట్టర్ యూజర్ మాస్సిమో షేర్ చేసిన ఈ వీడియో ఏకంగా 57 లక్షల వ్యూస్, 23 వేల లైక్స్‌తో దూసుకుపోతూ అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.
అసలు విషయం ఏంటంటే, ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒక కోడిని( Chicken ) సింపుల్‌గా, చాలా వింతగా హిప్నోటైజ్( Hypnotized ) చేశాడు.
వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒక ట్రిక్ చేస్తున్నారు.
ఒక వ్యక్తి కోడి తలను కిందకు వంచి, దాని ముక్కు నేలకు తాకేలా పట్టుకున్నాడు.రెండో వ్యక్తి వెంటనే కోడి ముక్కు నుంచి కొంచెం దూరం వరకు నేలపై ఒక స్ట్రెయిట్ లైన్ గీశాడు.
ఆపై మొదటి వ్యక్తి చేయి తీసేయగానే కోడి బొమ్మలా కదలకుండా అక్కడే స్తంభించిపోయింది.చూస్తుంటే నిజంగా మంత్రం వేసినట్టు ఉంది.
ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఆ గీతను చెరిపేయగానే, కోడి ఒక్కసారిగా ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి ఫాస్ట్‌గా పరిగెత్తింది.అంటే గీత ఉన్నంతసేపు కోడి హిప్నోటైజ్ అయిపోయిందా అని అందరూ నోరెళ్లబెడుతున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.కొందరు నవ్వుకుంటూ కామెంట్లు పెడుతుంటే, మరికొందరు మాత్రం ఇది నిజంగా జరుగుతుందా అని కళ్లు తేలేస్తున్నారు.ఒక యూజర్ అయితే ఫన్నీగా కామెంట్ చేశాడు: “నేను కూడా ట్రై చేశాను, వర్కౌట్ అయింది.వారం అయినా కోడి అక్కడే ఉంది, ఫుడ్ ఖర్చు తప్పింది” అని పంచ్ పేల్చాడు.
చాలా మంది ఈ ట్రిక్ తాము కూడా ట్రై చేస్తామని అంటున్నారు, ఇంకొందరు మాత్రం ఇది నిజమైన హిప్నోటైజమా లేక కోడి ఇచ్చే నాచురల్ రియాక్షనా అని డౌట్లు అడుగుతున్నారు.

మరి నిజంగానే ఇది హిప్నోటైజమా, లేక ఇంకేమైనానా అనే ప్రశ్నలకు ఎక్స్‌పర్ట్స్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు.కొన్నిసార్లు కొన్ని స్టిములస్‌లకు (stimuli) ప్రతిస్పందనగా అలా స్తంభించిపోతాయి అని అంటున్నారు.దీన్ని “టోనిక్ ఇమ్మొబిలిటీ” (Tonic immobility) అంటారట.
ఇది పక్షుల్లో, ఇతర జంతువుల్లో కామన్ రియాక్షనే అని చెబుతున్నారు.కానీ, గీత గీయడం వల్లనే ఇది జరుగుతుందా లేదా అనేది ఇంకా ఎవరికీ తెలీదు, అది చర్చనీయాంశంగా మారింది.
ఏదేమైనా, ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న సైన్స్ ఏమిటో కచ్చితంగా చెప్పలేకపోయినా, ఒక విషయం మాత్రం పక్కా, ఇది మాత్రం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది, ఆన్‌లైన్‌లో ఎండ్‌లెస్ డిస్కషన్స్‌కి దారితీసింది.దీన్ని మీరు కూడా చూసేయండి.







