సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు మండలం వెంకట్రాంపురం గ్రామపంచాయతీలోని పల్లె ప్రకృతి వనం గేట్లను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఆదరణకు నోచుకోకుండా పోతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.అధికారుల ఆదేశాలతో తొలగించారా లేక కబ్జా కోసం తొలగించారా అనే అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.







