ఇర్ఫాన్ ఖాన్ కుటుంబానికి ఎన్ని కోట్ల ఆస్తులు ఇచ్చి చనిపోయారో తెలుసా.. ?

బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు ఇర్ఫాన్ ఖాన్.తన అద్భుత నటనతో చక్కటి నటుడిగా క్రేజ్ సంపాదించుకున్నాడు.

 Properties Of Actor Irfan Khan , Hollywood, Bollywood, Irrfan Khan, Sutapa Sikka-TeluguStop.com

మరే ఇతర బాలీవుడ్ నటుడికి సాధ్యం కాని రీతిలో పలు పాత్రల్లో జీవించాడు.బాలీవుడ్ లోనే కాదు.

హాలీవుడ్ లోనే ఆయన పలు సినిమాల్లో నటించాడు.మంచి నటుడిగా పేరు పొందిన ఆయన చిన్న వయసులోనే కన్నుమూశారు.

ఆయన మరణం హిందీ చిత్రసీమలో తీరని శోకాన్ని మిగిల్చింది.ఇర్ఫాన్ కు భార్య సుతాప సిక్కర్, కొడుకులు బాబిల్, అయాన్ ఉన్నారు.

త్వరలో ఆయన కొడుకు బాలిల్ ఖాన్ హీరోగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఇర్ఫాన్ ఖాన్ చనిపోయిన తర్వాత.

తన సంపాదనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గత దశాబ్దం పాటు ఇర్ఫాన్ బాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగాడు.ఆయన కెరీర్ మంచి స్వింగ్ లో కొనసాగింది.తెలుగులో ఎలాగైతే శ్రీహరి పీక్స్ లో ఉండగానే చనిపోయాడో.సేమ్ అలాగే ఇర్ఫాన్ సైతం కెరీర్ పీక్స్ లో ఉండగానే చనిపోయాడు.అప్పట్లోనే ఇర్ఫాన్ ఒక్కో సినిమాకు రూ.5 నుంచి రూ.7 కోట్ల వరకు తీసుకునేది.పలు యాడ్స్ లో కూడా నటించాడు.

పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు.సుమారు 25 కోట్ల రూపాయాల వరకు ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Telugu Babil, Bollywood, Hollywood, Irfhan Khan, Irrfan Khan, Mumbai, Irfan Khan

ఇవే కాకుండా ఇర్ఫాన్ ఖాన్ కు రూ.100 కోట్ల వరకు నికర ఆస్తులు ఉన్నాయి.ముంబైలో రూ.15 కోట్ల విలువైన బంగళా ఉంది.దీనిలో అత్యతం ఖరీదైన ఇంటీరియర్ కూడా ఉంది.కార్లపై ఆయనకు పెద్దగా ఇంట్రెస్టు ఉండేది కాదు.అందుకే ఇప్పటికీ ఆయన రూ.10 లక్షల విలువ చేసే టొయోటానే వాడుతున్నాడు.ఆయన దగ్గర కేవలం ఇదొక్కటే కారుంది.మొత్తం ఆస్తుల విలువ కలుపుకుంటే ఇర్ఫాన్ ఖాన్ కు మొత్తం ఆస్తులు రూ.150 కోట్ల ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube