పట్టుకుందనే హెయిర్ ఫాల్ సమస్య ఓ పట్టాన వదలదు.జుట్టుపై ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా రాలిపోతూనే ఉంటుంది.
హెయిర్ ఫాల్‌కు అడ్డు కట్ట వేయడం కోసం కొందరు మందులు కూడా వాడుతుంటారు.అయినప్పటికీ ఫలితం లేకుంటే ఏం చేయాలో తెలీక తెగ సతమతం అయిపోతుంటారు.
అయితే హెయిర్ ఫాల్ సమస్యను నివారించడంలో ఫిష్ ఆయిల్(చేప నూనె) అద్భుతంగా సహాయ పడుతుంది.ఎక్కువ జిడ్డు కలిగిన చేపల కణజాలం నుండి ఫిష్ ఆయిల్‌ను సేకరిస్తారు.
దీనిలో విటమిన్ ఎ, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
అందుకే ఆరోగ్యానికి ఫిష్ ఆయిల్ బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తుంది.
అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.అలాగే జుట్టుకు సైతం ఫిష్ ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది.
మరి ఫిష్ ఆయిల్‌ను జుట్టుకు ఎలా ఉపయోగించాలో లేట్ చేయకుండా తెలుసు కుందాం పదండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఫిష్ ఆయిల్, ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
రాత్రి నిద్రించడానికి గంట ముందు ఈ ఆయిల్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి.ఉదయాన్నే మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
వారంలో రెండంటే రెండు సార్లు ఇలా చేశారంటే హెయిర్ ఫాల్ సమస్యకు స్వస్తి పలకొచ్చు.

ఫిష్ అయిల్‌లో ఉండే పోషక విలువలు జుట్టు కుదుళ్లకు బలాన్ని చేకూర్చి.రాలడాన్ని అరికడతాయి.మరియు పైన చెప్పిన విధంగా ఫిల్ ఆయిల్‌ను రాసుకుంటే జుట్టు ఒత్తుగా, నల్లగా మరియు పొడవుగా కూడా పెరుగుతుంది.
కాబట్టి, తప్పకుండా ఫిష్ ఆయిల్‌ను ట్రై చేయండి.