కొరటాల శివ. టాలీవుడ్ లో టాప్ దర్శకుడు.
ఆయన చేసిన పలు సినిమాలు వరుస విజయాలు సాధించాయి.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమా రూపొందిస్తున్నారు.
లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది.నిన్న అంటే.
జూన్ 15న ఆయన బర్త్ డే కావడంతో పలువురు సినిమా ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్పారు.రాంచరణ్, ఎన్టీఆర్, చిరంజీవి సహా పలువురు టాప్ హీరోలు ఆయనను విష్ చేశారు.
చిరంజీవి ఆయన గురించి ప్రత్యేకంగా ఓ పోస్టు రాసి శుభాకాంక్షలు చెప్పాడు.
అటు కొరటాల గురించి చిరు విష్ చేసిన విధానం పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.చిరంజీవి రాసిని వాఖ్యాలు.
విష్ చేసిన విధానం అద్భుతంగా ఉందంటూ అందరూ కొనియాడుతున్నారు.అంతేకాదు.
ఆచార్య యూనిట్ సభ్యులు సైతం కొరటాల జన్మదిన వేడుకలు నిర్వహించారు.కొరటాల శివ కొత్త ఫోటోలు యాడ్ చేసి విషెస్ చెప్పారు.
రాం చరణ్ కూడా కొరటాలతో తీసుకున్న తాజా ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విష్ చేశాడు.
అయితే ఈ ఫోటోలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.తాజా ఫొటోల్లో కొరటాలకు ఫుల్ హెయిర్ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.వాస్తవానికి కొరటాలకు బట్టతల ఉంది.
ఉన్న నాలుగైదు వెంట్రుకలతోనే ఆయన కవర్ చేసేవాడు.అయితే తాజాగా ఆయన తలపై నిండుగా జుట్టు కనిపిస్తుంది.
వీటిని చూసిన నెటిజన్లు కొరటాల హెయిర్ సర్జరీ చేయించుకున్నాడనే చర్చ నడుపుతున్నారు.ప్రస్తుతం కొరటాల వయసు 46 ఏండ్లు.జుట్టు పెట్టించుకుంటే తప్పేమీ లేదంటున్నారు మరికొందరు.ఏది ఏమైన కొత్త జుట్టుతో కొరటాల మస్త్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.అలాగే కంటిన్యూ చేయండి డైరెక్టర్ సాబ్.అంటున్నారు ఆయన అభిమానులు.