రక్తంలో యూరిక్ యాసిడ్ అధిక స్థాయి మూత్రపిండాల వ్యాధి, కీళ్ల నష్టం, గౌట్ ప్రమాదాన్ని పెంచుతాయి.అటువంటి పరిస్థితిలో దీనిని నివారించడానికి సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం, లక్షణాలను గుర్తించడం చాలా అవసరం.
యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో ఉండే వ్యర్థపదార్థం.శరీరం ప్యూరిన్స్ అనే సమ్మేళనాలను విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది.
సాధారణ పరిస్థితుల్లో యూరిక్ యాసిడ్ మూత్రపిండాలతో పాటు మూత్రం ద్వారా విసర్జితమవుతుంది.ప్యూరిన్లు సాధారణంగా శరీరంలో తయారవుతాయి.
ప్యూరిన్తు కొన్ని ఆహారాలు, పానీయాలలో కనిపిస్తాయి.అటువంటి పరిస్థితిలో మనం అధిక ప్యూరిన్ ఆహారాన్ని తీసుకున్నప్పుడు, శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడమనేది ప్రారంభం అవుతుంది.
ఇది గౌట్, కిడ్నీ వ్యాధి, గుండె జబ్బులు, ఎముకలకు నష్టం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది.
వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తెలుసుకునేందుకు యూరిక్ యాసిడ్ రక్త పరీక్ష అనేది చేస్తారు.దీనిని సీరం యూరిక్ యాసిడ్ పరీక్ష అని అంటారు. సీరం యూరేట్ లేదా యూఏ అని కూడా పిలుస్తుంటారు.
ఈ పరీక్షకు ముందు వైద్యులు.మిమ్మల్ని 4 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు ఏమీ తీసుకోకూడదని సూచిస్తుంటారు.
ఈ పరీక్షలో యూరిక్ యాసిడ్ స్థాయి స్త్రీలకు 6 mg/dL కంటే ఎక్కువ, పురుషులలో 7 mg/dL కంటే ఎక్కువగా ఉంటే, అది అధిక యూరిక్ యాసిడ్ స్థాయిగా పరిగణిస్తారు.ఇది చాలా కాలం పాటు చికిత్స చేయకుండా విస్మరిస్తే తీవ్రమైన లక్షణాలకు దారి తీస్తుంది.
అధిక యూరిక్ యాసిడ్ లక్షణాలు కీళ్ల నొప్పి, వాపు కీళ్ల చుట్టూ చర్మం రంగు మారడం వెన్నునొప్పి చేయి నొప్పి తరచుగా మూత్ర విసర్జన మూత్రంలో రక్తం పడటం, దుర్వాసన రావడం.వికారం లేదా వాంతులు మూత్రపిండాలలో రాళ్లు గౌట్అని వైద్య పరిశోధకులు చెబుతున్నారు.
ఆహారంలో మార్పులు, వ్యాయామం ద్వారా బరువును తగిన విధంగా నిర్వహించడం ద్వారా రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.