ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం, శరీర బరువుపై ఉన్న ప్రత్యేక శ్రద్ధతో చాలా మంది వైట్ రైస్( White rice ) కు బదులుగా బ్రౌన్ రైస్ ను ఎంపిక చేసుకుంటున్నారు.బ్రౌన్ రైస్‌లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి.
బరువు నియంత్రణకు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బ్రౌన్ రైస్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.అలాగే బ్రౌన్ రైస్ శరీరానికి అవసరమైన శక్తిని అందించడంతో పాటు పలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అయితే బ్రౌన్ రైస్( Brown rice ) ఆరోగ్యకరమే.కానీ కొందరు మాత్రం తినకూడదు.ఈ కొందరు ఎవరు? వారెందుకు బ్రౌన్ రైస్ తినకూడదు? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.కిడ్నీ సమస్యలు ఉన్నవారు బ్రౌన్ రైస్ తినకూడదు.
బ్రౌన్ రైస్ లో ఫాస్ఫరస్, పొటాషియం( Phosphorus, potassium ) ఎక్కువగా ఉంటాయి.కిడ్నీ సమస్యలు ఉన్నవారు అధిక పొటాషియం తీసుకుంటే హార్ట్ ప్రాబ్లెమ్స్, వాపులు వచ్చే అవకాశం ఉంటుంది.

అలాగే థైరాయిడ్ ( Thyroid )సమస్యతో బాధపడేవారు బ్రౌన్ రైస్ కు దూరంగా ఉండటమే ఉత్తమం.బ్రౌన్ రైస్‌లో గోయ్ట్రోజెన్స్ అనే పదార్థాలు ఉంటాయి.ఇవి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించవచ్చు.హైపోథైరాయిడిజం ఉన్నవారికి ఇది మంచిది కాదు.బ్రౌన్ రైస్‌లో అధిక ఫైబర్ ఉంటుంది.అందువల్ల కొందరు అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటారు.
ఇలాంటి వారు కూడా బ్రౌన్ రైస్ ను ఎవైడ్ చేయాలి.

రక్తహీనత, బలహీనత ( Anemia, weakness )ఉన్నవారు బ్రౌన్ రైస్ తీసుకునే ముందు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.ఎందుకంటే, బ్రౌన్ రైస్ లో ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.ఇది కాల్షియం, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణను తగ్గిస్తుంది.
చిన్న పిల్లలకు కూడా బ్రౌన్ రైస్ పెట్టకపోవడమే మంచిది.ఎందుకంటే చిన్నారుల జీర్ణవ్యవస్థ అనేది పూర్తిగా అభివృద్ధి చెందదు.
కాబట్టి, అధిక మొత్తంలో ఫైబర్ ను కలిగి ఉండే బ్రౌన్ రైస్ చిన్నారుల్లో జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.