ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.44
సూర్యాస్తమయం: సాయంత్రం.6.19
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: చవితి మంచిది కాదు.
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.ఇంటాబయట ఊహించని చికాకులు పెరుగుతాయి.దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.
వృషభం:

ఈరోజు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.దైవ అనుగ్రహం తో వ్యాపారాలు లాభాల బాట పడతాయి.ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
మిథునం:

ఈరోజు ఇంటాబయట చికాకులు పెరుగుతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది.
సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి.దూర ప్రయాణం సూచనలు ఉన్నవి.
వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.
కర్కాటకం:

ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది.ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు.ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
సింహం:

ఈరోజు ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.ఇంటా బయట మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు.నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
కన్య:

ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు.నూతన రుణయత్నాలు చేస్తారు.
దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
ఖర్చులు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
తుల:

ఈరోజు ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తాయి.కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
వృశ్చికం:

ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.తన పరంగా ఇబ్బందులు తప్పవు.
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తప్పవు.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది.వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.
ధనుస్సు:

ఈరోజు దీర్ఘ కాలిక రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు.నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.
కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు.
మకరం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు.వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.
కుంభం:

ఈరోజు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఆదాయం ఆశించినంత లభించదు.ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి.ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
మీనం:

ఈరోజు చేపట్టిన పనులలో నిదానంగా సాగుతాయి.వ్యాపార వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు.ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.వృథా వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు.
.