సాధారణంగా చాలామంది వారికి ఇష్టమైన వారు చనిపోవడంతో వారికి సంబంధించిన వస్తువులను తమ దగ్గర వారి గుర్తుగా పెట్టుకుంటూ ఉంటారు.వారి వస్తువులను జ్ఞాపకంగా, గుర్తుగా ఉపయోగిస్తారు.
అయితే కొందరు మరణించిన వారి వస్తువులను నాశనం చేస్తారు.మృతి చెందిన వారి వస్తువులు వినియోగించడం మంచిదే.
కానీ పొరపాటున కూడా వారికి సంబంధించిన వస్తువులను మనం తప్పుగా అస్సలు ఉపయోగించకూడదు.ఇది చనిపోయిన వారి ఆత్మను( Soul ) ఆకర్షిస్తుందని, దీంతో ఇంట్లో ప్రతికూలతను వ్యాప్తి చేస్తుందని నమ్ముతారు.
మరి ఎలాంటి వస్తువులను తప్పుగా వినియోగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి వ్యక్తి తాను ధరించే ఆభరణాల పట్ల( Ornaments ) ఎంతో అనుబంధం ఉంటుంది.ఇక చనిపోయిన వ్యక్తి ఆత్మకు కూడా ఇది వర్తిస్తుంది.గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన నగలు అస్సలు ధరించకూడదు.
వాటిని ధరిస్తే మరణించిన వ్యక్తి శక్తి లేదా ఆత్మ అతని ఆభరణాలను ధరించి వ్యక్తిని ఆవహిస్తుంది.అలా జరగకూడదనుకుంటే ఏం చేయాలో కూడా గరుడ పురాణంలో( Garuda Puranam ) సూచించడం జరిగింది.
వారి ఆభరణాలను ఉపయోగించాలి అనుకుంటే ఆ నగలను కరిగించి వాటితో కొత్త నగలు చేయించుకొని ధరించడం మంచిది.అలాగే కొత్త నగలను తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు.అలాగే మరణించిన వ్యక్తి తన మరణానికి ముందు తన ఆభరణాలను మీకు బహుమతిగా ఇస్తేనే, దీనిని మీరు కరిగించకుండా అలాగే ఉపయోగించుకోవచ్చు.

అలాగే వాటిని పవిత్రంగా ఉంచవచ్చు.అలా కాకుండా మరణించిన వ్యక్తి మీకు బహుమతిగా ఇవ్వకుండా ఆ వ్యక్తి యొక్క ఆభరణాలను ధరించే తప్పు అస్సలు చేయకూడదు.ఒక వ్యక్తి ఆభరణాల కంటే మరీ ఎక్కువగా ఇష్టపడేవి ఏమైనా ఉన్నాయా ఏంటి అవి దుస్తులు( Clothes ) మాత్రమే.
అలాంటి పరిస్థితుల్లో మీరు వారి దుస్తులను ధరించడం వలన వారి ఆత్మను ఆకర్షించవచ్చు.అందుకే చనిపోయిన వారి దుస్తులు ధరించడం మానుకోవాలి.ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని వస్త్రాలు దానం చెయ్యాలి.అలా చేయడం వలన చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి, మోక్షం కలుగుతుంది.
ఇక చనిపోయిన వ్యక్తి చేతి గడియారం( Wrist Watch ) కూడా అస్సలు ఉపయోగించకూడదు.చనిపోయిన వారి సానుకూల, ప్రతికూల శక్తి వాచ్ లో నివసిస్తుందని నమ్ముతారు.