రోజు ఉదయం ఈ జ్యూస్ తాగితే రక్తహీనత నుంచి బలహీనత వరకు అన్ని సమస్యలు పరార్!

ఉదయం నిద్ర లేచిన తర్వాత చాలా మంది తమ రోజును టీ( Tea ) లేదా కాఫీతో ప్రారంభిస్తుంటారు.టీ, కాఫీ వంటి పానీయాల వల్ల మైండ్ రిఫ్రెషింగ్ గా ఉండవచ్చు.

 Drink This Juice In The Morning, All Problems From Anemia To Weakness Will Go Aw-TeluguStop.com

కానీ హెల్త్ బెనిఫిట్స్ మాత్రం పెద్దగా ఏమీ ఉండవు.అదే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ తో మీ డే ను స్టార్ట్ చేశారంటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు.

అదే సమయంలో రోజంతా ఫుల్ యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటారు.మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి.? అది ఎటువంటి ప్రయోజనాలు అందిస్తుంది.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో అరకప్పు బీట్ రూట్ ముక్కలు( Beet root slices ), అర కప్పు క్యారెట్ ముక్కలు( Carrot slices ), అర కప్పు బొప్పాయి పండు ముక్కలు మరియు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.ఇలా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ ను స్టైనర్ సహాయంతో ఎక్స్ట్రాక్ట్ చేసుకుని కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసి తాగితే అదిరిపోతుంది.

ఈ బీట్ రూట్ క్యారెట్ పపాయ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది.అలాగే అనేక రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటుంది.రోజు ఉదయం ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్ ల‌భిస్తాయి.

Telugu Problemsanemia, Beetroot, Beetrootcarrot, Carrot, Tips, Healthy, Latest,

బీట్ రూట్ క్యారెట్ పపాయ జ్యూస్ ( Papaya juice )లో ఐరన్ కంటెంట్ పుష్క‌లంగా ఉంటుంది.ఈ జ్యూస్ ను రెగ్యుల‌ర్ డైట్ లో చేర్చుకుంటే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ప‌రార్ అవుతుంది.అలాగే ఈ జ్యూస్‌లోని విటమిన్లు ఎ మరియు సి శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తాయి.బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు ఉంటాయి.

ఇవి రక్త నాళాలను విస్తరించడానికి మరియు రక్తపోటును తగ్గించడానికి తోడ్ప‌డ‌తాయి.

Telugu Problemsanemia, Beetroot, Beetrootcarrot, Carrot, Tips, Healthy, Latest,

బీట్ రూట్ క్యారెట్ ప‌పాయ జ్యూస్ కాలేయ పనితీరుకి మ‌ద్ద‌తు ఇస్తుంది.మరియు మొత్తం శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది.అంతేకాదు ఈ జ్యూస్ బ‌ల‌హీన‌త‌ను త‌రిమికొడుతుంది.

శక్తి స్థాయిలను పెంచుతుంది.జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత ను మెరుగుపరుస్తుంది.

చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరిపిస్తుంది.ఆడ‌వారిలో నెల‌స‌రి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడుతుంది.

మ‌రియు బ‌రువు నిర్వాహ‌ణలోనూ స‌హాయ‌ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube