మన దేశంలో చాలా మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని( Astrology ) గట్టిగా నమ్ముతారు.వారి జీవితంలో ఏ చిన్న మార్పు జరిగినా అది జ్యోతిష్యం ప్రకారమే జరిగిందని నమ్మేవారు కూడా ఉన్నారు.
అయితే జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మని వారు కూడా మన దేశంలో ఉన్నారు.అయితే మన రాశులను బట్టి గ్రహణ ప్రభావం ఉంటుందని జ్యోతిష్యా నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులకు మంచి ఫలితాలు దక్కితే మరికొన్ని రాశులకు అ శుభ కలుగుతాయి.ఇంకా చెప్పాలంటే బుధ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.
ఈ గ్రహం సంచారం చేస్తే మొత్తం 12 రాశుల పై ప్రభావం పడుతుంది.బుధుడు జూన్ ఏడు నుంచి మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి( Taurus ) సంచారం చేయబోతున్నాడు.
దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అస్సలు కలిసి రాదు.ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారికి శుభప్రదంగా ఉండనుంది.కానీ వ్యాపారాలు చేసేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.లేకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశలు ఉన్నాయి.ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.ఎలాంటి పనులు చేసిన శ్రద్ధతో చేయాలి.కర్కాటక రాశి ( Cancer sign )వారికి బుధుడు తృతీయ, 12వ స్థానంలో అధిపతిగా ఉంటాడు.
వృషభ రాశిలో బుధుడు సంచారం చేయడం వల్ల కర్కాటకరాశి వారికి ప్రతికూల ఫలితాలు పడతాయి.ఆరోగ్య సమస్యలు వస్తాయి.
కాబట్టి పలు రకాల జాగ్రతలు తీసుకోవడం మంచిది.ఇంకా చెప్పాలంటే మిథున రాశిలో బుధుడు నాలుగో స్థానంలో అధిపతిగా వ్యవహరిస్తాడు.
దీని వల్ల మీరు తీవ్రంగా ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది.మానసిక ఒత్తిడి ఇతర సమస్యలు వస్తాయి.
కాబట్టి వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది.