సినిమా ఇండస్ట్రీ లోకి ఎవరైనా ఒకరు వచ్చి సక్సెస్ అయ్యారు అంటే వారికి సంబంధించిన వారు వస్తూనే ఉంటారు ఇప్పుడు అలా ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు సంబంధించిన కొడుకులు అల్లుళ్లు గా ఉన్న నటులు మాత్రమే స్టార్ హీరోలు గా చలామణి అవుతున్నారు.హీరోనే కాదు హీరోయిన్స్ కూడా ఒకసారి హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించుకున్న తర్వాత వాళ్ళ చెల్లెలు కూడా హీరోయిన్ గా పరిచయమవుతున్నారు అలా వచ్చి వాళ్ళ అదృష్టం పరీక్షించుకున్న వారెవరో ఇప్పుడు చూద్దాం.
జీవిత చెల్లె ఉమా

జీవిత తెలుగులో ఎంత పెద్ద హీరోయిన్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు రాజశేఖర్ తో అంకుశ,తలంబ్రాలు లాంటి సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సాధించుకున్నారు అయితే జీవిత హీరోయిన్ గా ఉన్నప్పుడు తనతో పాటు ఆవిడ కూడా షూటింగ్ కి వచ్చేది అలాంటి సందర్భంలోనే తలంబ్రాలు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఉమాని చూసి తలంబ్రాలు సినిమా లో కళ్యాణ్ చక్రవర్తి చెల్లెలిగా చేయమని అడిగాడు కానీ తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు జీవిత కూడా తనకి నటన మీద అ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సార్ అని చెప్పినప్పటికీ శ్యాం ప్రసాద్ రెడ్డి వినకుండా మొండిగా పట్టుపట్టి ఆ సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి చెల్లెలుగా నటింపచేశాడు.ఆ తర్వాత కూడా తను కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి రిలీజ్ కాలేదు దాంతో సినిమాలు మనకు పెద్దగా అచ్చిరావు అని అనుకొని పెళ్లిచేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు.
కాజల్ అగర్వాల్ నిషా అగర్వాల్

జల్ తేజ తీసిన లక్ష్మీకళ్యాణం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై క్రియేటివ్ డైరెక్టర్ అయిన కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సాధించింది ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సాధించి ఏకంగా స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది.ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది అయితే కాజల్ సక్సెస్ కావడంతో తన చెల్లి అయిన నిషా అగర్వాల్ కూడా వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఏమైంది ఈ వేళ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది.తర్వాత ఆమె చేసిన సోలో సినిమా కూడా హిట్టయింది.వరుసగా అవకాశాలు రావడంతో సుకుమారుడు లాంటి ఫ్లాప్ సినిమాలు చేయడం వల్ల తన కెరియర్ పెద్దగా సాగలేదని చెప్పాలి దాంతో చేసేదేం లేక పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు.
ఆర్తి అగర్వాల్ అదితి అగర్వాల్

వ్వు నాకు నచ్చావ్ సినిమా తో ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్తిఅగర్వాల్ తర్వాత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సాధించింది ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది.తరుణ్,ఉదయ్ కిరణ్, మహేష్ బాబు, రవితేజ ప్రభాస్, నాగార్జున,బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోల పక్కన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.అయితే అల్లు అర్జున్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లె అయిన అదితి అగర్వాల్ హీరోయిన్ గా పరిచయం అయింది ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు సాధించిన అదితి అగర్వాల్ తర్వాత సక్సెస్ లను అందుకోలేకపోయారు ముఖ్యంగా ఎమ్మెస్ నారాయణ తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ తనే స్వయంగా డైరెక్ట్ చేసిన కొడుకు సినిమాలో హీరోయిన్ గా నటించింది ఆ సినిమా ప్లాప్ అవడంతో తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.
నగ్మా జ్యోతిక

తెలుగులో లో మంచి సినిమాలు చేసి గుర్తింపు సాధించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నగ్మా అనే చెప్పుకోవాలి.చిరంజీవి వెంకటేష్ లాంటి అగ్ర హీరోలందరితో నటించి మంచి గుర్తింపు సాధించారు.చిరంజీవితో ఘరానా మొగుడు సినిమా లో నటించి హీరోయిన్ గానే కాదు నటిగా కూడా మంచి గుర్తింపు సాధించారు.ఈవిడ స్టార్ హీరోయిన్ అయిన తర్వాత ఆమె చెల్లె అయిన జ్యోతిక కూడా సినిమాల్లోకి వచ్చి మంచి గుర్తింపును సాధించారు తెలుగులో చిరంజీవి పక్కన ఠాగూర్ సినిమాలో నటించింది అలాగే నాగార్జున పక్కన మాస్ సినిమాల్లో నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.
సరిత, విజి చంద్రశేఖర్
ఇక సౌత్ ఇండియాలో పాపులర్ నటి మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత చెల్లెలు విజి చంద్రశేఖర్ సైతం తమిళనాట హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు
.