కొందరికి సినిమా ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ ఉండటంతో వారి వారసులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఎంట్రీ అవుతారు.మరికొందరు సినీ పరిశ్రమలో ఎవరూ తెలియకపోయినా.
తమ మీద తమకు ఉన్న నమ్మకమే అవకాశాలు వచ్చేలా చేస్తుంది.కానీ.
ఇందుకోసం కాళ్ల చెప్పులు అరిగేలా తిరగాల్సి ఉంటుంది.ఎన్నో అవస్థలు పడాల్సి ఉంటుంది.
కష్టాల కడలి లో నుంచి అవకాశాల వెల్లువ వస్తుంది.తొలి నాళ్లలో అలా ఇబ్బందులు పడ్డవారే ప్రస్తుతం టాప్ హీరోలుగా, దర్శకులుగా కొనసాగుతున్నారు.
సినిమాల్లోకి రావడానికి సినిమా కష్టాలు పడ్డ వ్యక్తే శ్రీను వైట్ల.అవకాశాల కోసం చెన్నై వెళ్లారు.సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగారు.చిన్న రూం అద్దెకు తీసుకుని.
ఉన్నదో లేనిదో తిని మళ్లీ వేట మొదలు పెట్టేవారు.అతడితో పాటు మరో వ్యక్తి కూడా ఇదే రూంలో ఉండేవాడు.
తనేఅనిల్ సుంకర.శ్రీను వైట్ల సినిమాల కోసం ప్రయత్నం చేస్తుండగా.
అనిల్ సుంకర మాత్రం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.చెన్నైలోని శ్రీను వైట్ల రూంలో ఉంటూ సాప్ట్ వేర్ కోర్సు నేర్చకున్నాడు.
చాలా ప్రయత్నాల తర్వాత శ్రీనువైట్ల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.అనిల్ సుంకర అమెరికా వెళ్లిపోయాడు.
రవితేజ, మహేశ్వరి హీరో హీరోయిన్లుగా శ్రీను వైట్ల నీ కోసం అనే సినిమా మొదలు పెట్టాడు.
అమెరికాలో అనిల్ బిజినెస్ మొదలు పెట్టి సక్సెస్ అయ్యాడు.శ్రీను వైట్ల సలహాతో అనిల్ సుంకర సినిమా నిర్మాణంలో డబ్బులు పెట్టాడు.మొదట బిందాస్ సినిమాకు ప్రొడ్యూసర్ గా చేశాడు.
ఆ తర్వాత శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన నమో వెంకటేష.దూకుడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.
ఈ సినిమాలు మచి విజయం సాధించడంతో తనూ మంచి లాభాలు పొందాడు.అనంతరం 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను స్థాపించి.
ఎన్నో హిట్ సినిమాలకు నిర్మాతగా మారాడు అనిల్.మొత్తంగా శ్రీను వైట్ల సూచనతో సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టిన అనిల్ ఆ తర్వాత మంచి నిర్మాతగా వెలుగొందాడు.