అటుకులువీటిని వరి ధాన్యం నుంచి తయారు చేస్తారు.చక్కటి రుచిని కలిగి ఉండే అటుకుల్లో కొవ్వు పదార్థాలు, గ్లూకోజ్ వంటివి ఏమీ ఉండవు.
విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలే నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా అన్ని వయస్కుల వారికి అటుకులు ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.
ముఖ్యంగా గర్భిణీలకు అటుకులు ఓ వరమనే చెప్పొచ్చు.సాధారణంగా చాలా మంది ప్రెగ్నెన్సీ సమయంలో వైట్ రైస్ తినడానికి ఇష్టపడరు.
అయితే వైట్ రైస్‌కు ప్రత్యామ్నాయంగా అటుకులను ఎంచుకోవచ్చు.వైట్ రైస్ కంటే అటుకులే ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలను రక్తహీనత సమస్య అధికంగా వేధిస్తుంటుంది.ఈ రక్తహీనత వల్ల కడుపులోకి శిశువు ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.
అలాగే తక్కువ వెయిట్‌తో బేబీ పుట్టే అవకాశాలు కూడా ఉంటాయి.అందుకే ఈ సమయంలో రక్తహీనతకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు.

అయితే అందుకు అటుకులు అద్భుతంగా సహాయపడతాయి.అటుకుల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా నిండి ఉంటుంది.అందువల్ల, గర్భిణీలు ప్రతి రోజు కొంత మొత్తంలో అటుకులను తీసుకుంటే రక్తహీనత సమస్యకు దూరంగా ఉండొచ్చు.అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు మహిళలు మధుమేహానికి గురవుతుంటారు.ఈ జాబితాలో మీరు ఉండకూడదనుకుంటే తప్పకుండా అటుకులను డైట్‌లో చేర్చుకోండి.ఎందుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలును అదుపులో ఉంచే సామర్థ్యం అటుకులకు ఉంది.
అంతేకాదు, గర్భిణీలు అటుకులను తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.జీర్ణ వ్యవస్థ చురుగ్గా పని చేస్తుంది.
కడుపులోని శిశువు ఎదుగుదల మెరుగ్గా సాగుతుంది.మరియు రోగ నిరోధక వ్యవస్థ సైతం బలంగా మారుతుంది.
కాబట్టి, అటుకులను ఆహారంలో భాగం చేసుకోవడం అస్సలు మరచిపోవద్దు.