కొబ్బ‌రి పాలు, ఆముదం క‌లిపి జుట్టుకు ప‌ట్టిస్తే ఆ స‌మ‌స్య‌ల‌న్నీ పరార్‌!

కొబ్బ‌రి పాలు రుచిగా ఉండ‌ట‌మే కాదు బోలెడ‌న్ని పోష‌కాలను క‌లిగి ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా కొబ్బ‌రి పాలు అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంటాయి.

 Add Coconut Milk And Castor Oil To Your Hair And You Will Get Rid Of All Those P-TeluguStop.com

అలాగే జుట్టు సంర‌క్ష‌ణ‌కు కూడా కొబ్బ‌రి పాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ముఖ్యంగా కొబ్బ‌రి పాలు, ఆముదం క‌లిపి జుట్టుకు ప‌ట్టిస్తే వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌లను వ‌దిలించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం కొబ్బ‌రి పాలు, ఆముదం ఎలా క‌లిపి రాసుకోవాలి.? ఈ రెండిటినీ క‌లిపి వాడితే ఏయే ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.? వంటి విష‌యాల‌ను తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి హీట్ చేయాలి.

ఆముదం గోరు వెచ్చ‌గా అవ్వ‌గానే స్ట‌వ్ ఆఫ్ చేసి.అందులో ఓ అర క‌ప్పు కొబ్బ‌రి పాలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వ‌ర‌కు అప్లై చేసుకుని ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌లస్నానం చేయాలి.

ఇలా వారంలో ఒక్క‌సారి చేస్తే గ‌నుక మ‌స్తు బెనిఫిట్స్ పొందొచ్చు.ముఖ్యంగా హెయిర్ ఫాల్ స‌మ‌స్యతో బాధ ప‌డే వారు పైన చెప్పిన విధంగా కొబ్బ‌రి పాలు, ఆముదం క‌లిపి జుట్టుకు ప‌ట్టించాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల కుదుళ్ల‌కు మంచి బ‌లం చేకూరి ఊడ‌టం త‌గ్గుతుంది.అలాగే చుండ్రుతో స‌త‌మ‌తం అయ్యే వారికి ఇది బెస్ట్ రెమెడీగా చెప్పుకోవ‌చ్చు.

వీక్లీ వ‌న్స్ పైన చెప్పిన విధంగా చేస్తే చుండ్రు క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

Telugu Oil, Coconut Milk, Dandruff, Care, Care Tips, Fall, Problems, Latest-Telu

అంతే కాదండోయ్‌.కొబ్బ‌రి పాలు, ఆముదం క‌లిపి రాసుకోవ‌డం వ‌ల్ల జుట్టు త్వ‌ర‌గా తెల్ల బ‌డ‌కుండా ఉంటుంది.పొడి జుట్టు స‌మ‌స్య ఉంటే ప‌రార్ అవుతుంది.

కేశాలు స్మూత్ అండ్ సిల్కీగా మార‌తాయి.మ‌రియు జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube