ఏడాదిలో కొన్ని మాసాలు మాత్రమే తెరిచి ఉండే బద్రీనాథ్ దేవాలయానికి( Badrinath Temple ) ఎంతో ప్రాముఖ్యత ఉంది.అలాంటి పవిత్రమైన దేవాలయంలో ఈ పనులను అస్సలు చేయకూడదు.
చేస్తే పాపం అంటుకుంటుంది అని పండితులు చెబుతున్నారు.మరి ఆ పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బద్రీనాథ్ దేవాలయానికి మహా విశిష్టత ఉంది అని దాదాపు చాలా మందికి తెలుసు.పురాణాల ప్రకారం సత్య యుగం వరకు భక్తులందరూ ఇక్కడ విష్ణుమూర్తి దర్శనం పొందుతారు.
త్రేతాయుగంలో దేవతలు, ఋషులు మాత్రమే శ్రీహరి దర్శనం చేసుకునేవారు.బద్రీనాథ్ నీ శ్రీమహా విష్ణువుకి రెండో నివాసం అని, అందుకే దీన్ని రెండవ వైకుంఠమని అంటారు.
ఇంతటి విశిష్టత కలిగిన ఈ దేవాలయంలో శంఖాన్ని పూరించకూడదని పండితులు చెబుతున్నారు.పురాణాల ప్రకారం బద్రీనాథ్ కి చెందిన ఇద్దరు రాక్షసులలో ఒక రాక్షసుడు శంఖంలో దాక్కున్నాడని శంఖాన్ని పూరించడం వల్ల ఆ రాక్షసుడు బయటికి వస్తాడు అని చెబుతూ ఉంటారు.కాబట్టి బద్రీనాథ్ దేవాలయం వద్ద శంఖం పూరించకూడదని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా ఈ దేవాలయంలో ఇంకా చాలా విశిష్టతలు ఉన్నాయి.బద్రీనాథ్ దేవాలయం తలుపులు తెరిచినప్పుడు యోగ బద్రిపై అమర్చిన నెయ్యి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు.అక్కడ ఉండే బద్రీనాథ్ విగ్రహాన్ని ఎవరు ముట్టుకోకూడదని నియమం ఉంది.
ఈ బద్రీనాథ్ దేవాలయం ( Badrinath Temple )ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అలకనంద నది( Alaknanda River ) తీరాన నారా నారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఉంది.
ఇంకా చెప్పాలంటే బద్రీనాథ్ దేవాలయంలో భక్తులు వేసవికాలం నుంచి ఆరు నెలల పాటు శ్రీహరిని పూజిస్తారు.ఇంకా చెప్పాలంటే ఆ తర్వాత చలికాలం నుంచి ఆరు నెలల పాటు దేవతలు పూజిస్తారు.దేవతలకు ప్రతినిధిగా నారదా ముని పూజిస్తారు.
దేవాలయ తలుపులు మూసి ఉన్నప్పుడు నారదుడు అఖండ జ్యోతిని వెలిగిస్తాడని ఈ స్థల పురాణంలో ఉంది.బద్రీనాథ్ దేవాలయాన్ని తిరిగి తెరిచినప్పుడు అక్కడ వెలిగే ఉండే అఖండ జ్యోతి( Akhanda Jyoti ) దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ సమయంలో అతింద్రీయ కాంతిని చూసేందుకు భక్తులు పొట్టెతుతారు. అఖండ జ్యోతిని చూసినా వారు పాపం నుంచి విముక్తి పొంది మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
DEVOTIONAL