మారుతున్న కాలానికి తగ్గట్లుగా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో సంస్కరణలు తీసుకొస్తోంది కెనడా( Canada ).మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన విద్య, మంచి ఉద్యోగావకాశాలు వుండటంతో పలు దేశాల విద్యార్ధులు కెనడాకు క్యూ కడుతున్నారు.
అలాగే సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, వీసా జారీ, త్వరగా శాశ్వత నివాస హోదా వంటి అనుకూల అంశాలు కెనడా వైపు విద్యార్ధులను ఆకర్షిస్తున్నాయి.కోవిడ్ తర్వాత ఇమ్మిగ్రేషన్ విధానంతో కెనడాకు వలసలు పెరుగుతున్నాయి.
వీటిని మరింత పెంచేందుకు అక్కడి ప్రభుత్వం కృషి చేస్తోంది.దీనిలో భాగంగా 2025 నాటికి దాదాపు 5 లక్షల మంది వలసదారులను ఆకర్షించాలని కెనడా లక్ష్యంగా పెట్టుకుంది.
2024-26 కోసం ఇమ్మిగ్రేషన్ ప్రణాళికలను ఆవిష్కరించిన ఇమ్మిగ్రేషన్ , రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ ( Minister Mark Miller )మీడియాతో మాట్లాడుతూ.2026 నుంచి ఇమ్మిగ్రేషన్ స్థాయిలను 5 లక్షలకు పరిమితం చేయనున్నట్లు తెలిపారు.ఇమ్మిగ్రేషన్, విద్యారంగం పరంగా కెనడాకి భారత్ అతిపెద్ద మార్కెట్ కావడంతో.ఎప్పటిలాగే ఆ దేశ విధానాలు భారతీయులకు మేలు చేకూర్చనున్నాయని నిపుణులు చెబుతున్నారు.ఎకనమిక్ కేటగిరీ కింద 2,81,135 మంది.ఫ్యామిలీ కేటగిరీ కింద 1,14,000 మంది భారతీయులకు కెనడాలో ఎంట్రీ దొరకనుందని అంచనా.
గతేడాది 1,18,000 మంది భారతీయులు కెనడియన్ పర్మినెంట్ రెసిడెన్సీ( Canadian Permanent Residency ) (పీఆర్) తీసుకున్నారు.కెనడాకు కొత్తగా వచ్చిన 4,37,120 మందిలో నాలుగో వంతు మంది భారతీయులే కావడం గమనార్హం.కొత్త ఇమ్మిగ్రేషన్ లక్ష్యాలు ప్రతి ఏడాది కెనడా జనాభాను 1.3 శాతం పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.నిజానికి .దేశం తీవ్రమైన గృహాల కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ కెనడియన్ జనాభా 40 మిలియన్ల మార్కును దాటడానికి రికార్డు ఇమ్మిగ్రేషన్ స్థాయిలు సహాయపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇకపోతే.అమెరికాలో ప్రస్తుతం హెచ్ 1 బీ వీసాపై ( H1B visa )వున్న నిపుణులకు తమ దేశంలో వర్క్ పర్మిట్ ఇస్తామంటూ ఇటీవల కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.తొలి రోజులోనే ఈ పథకం దాని లక్ష్యాన్ని చేరుకుంది.హెచ్ 1 బీ వీసాదారుల కోసం కొత్త వర్క్ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 16 నుంచి కెనడా అనుమతించింది.
ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) దీనిపై తాజాగా ప్రకటన చేసింది.ప్రస్తుతం సరిపడినన్ని దరఖాస్తులు రావడంతో ఈ స్కీమ్‌ను మూసివేస్తునట్లు తెలిపింది.జూలై 17న ఈ కొత్త స్కీమ్ కోసం 10,000 దరఖాస్తుల పరిమితిని చేరుకున్నామని ఐఆర్‌సీసీ వెల్లడించింది.