ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ( Netflix )ఒకప్పుడు తెలుగు సినిమాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చినా ఇప్పుడు మాత్రం తెలుగు సినిమాలకు ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఇస్తోంది.ఆర్.
ఆర్.ఆర్ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలై ఊహించని స్థాయిలో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ( Harika Hasini Creations, Sitara Entertainments banner )లో తెరకెక్కిన సినిమాల డిజిటల్ హక్కులలో మెజారిటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.
హక్కులను సొంతం చేసుకున్న క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన వివరాలను నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.పుష్ప2 రూల్ మూవీ( Pushpa2 rule movie ) త్వరలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే.అయితే ఓజీ సినిమా( OG movie ) డిజిటల్ హక్కులు తమ ఓటీటీ సొంతం అయినట్టు నెట్ ఫ్లిక్స్ నుంచి ప్రకటన వెలువడింది.
సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
ఈ ఏడాదే ఓజీ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.చైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన తండేల్ ( Tandel )ఫిబ్రవరి నెల 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా డిజిటల్ హక్కులు సైతం నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయి.
మాస్ జాతర, హిట్3, విజయ్ గౌతమ్ కాంబో మూవీ, మ్యాడ్ స్క్వేర్, జాక్, కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ, అనగనగా ఒకరాజు, ది గ్రేటెస్ట్ రైవలరీ : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ డాక్యుమెంటరీ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.
నెట్ ఫ్లిక్స్ క్రేజీ సినిమాల డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ఒకింత భారీ స్థాయిలో ఖర్చు చేసిందని తెలుస్తోంది.నెలకు ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.
నెట్ ఫ్లిక్స్ స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తున్న మరో ఓటీటీ లేదనే సంగతి తెలిసిందే.