Tollywood Heroines : 2023 నాటికి టాప్ 10 తెలుగు రిచ్ హీరోయిన్స్ వీరే !

డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి ఈరోజుల్లో డబ్బు సంపాదించడం చాలా తేలిక అని అందరూ అనుకుంటారు.పైగా సినిమా ఇండస్ట్రీలో అయితే డబ్బు కోట్లల్లో వస్తుంది.

 Tollywood Top 10 Rich Heroines-TeluguStop.com

అందుకే అందరూ గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమా ఇండస్ట్రీపై మోజు పడుతూ ఉంటారు.అయితే మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఈ ఏడాది అత్యంత రిచ్ హీరోయిన్స్ ఎవరో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1.అనుష్క శెట్టి

ప్రస్తుతం ఎలాంటి సినిమా విడుదల అవ్వకపోయినా అనుష్క టాలీవుడ్ లోనే రిచ్ హీరోయిన్ గా కొనసాగుతుంది.ఈమె ఆస్తి దాదాపు 114 కోట్లు.

2.తమన్నా

వజ్రాల వ్యాపారం చేసే కుటుంబంలో జన్మించిన తమన్నా సినిమాలు పరంగాను బాగానే డబ్బులు కూడా పెట్టింది.ఈమె ఆస్తి 111 కోట్లు అనే విషయం తెలిసి సోషల్ మీడియాలో నెటిజన్స్ షాక్ కి గురవుతున్నారు.

3.సమంత

పెళ్లి చేసుకుని ఫేడ్ అవుట్ అయిపోతుందనుకున్నా సమంత ప్రస్తుతం డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారడంతో ఆమె సంపాదన మరింత పెరిగింది.దాదాపు ఈమె ఆస్థి కూడా 100 కోట్లకు పైగానే ఉంటుంది.

4.కాజల్ అగర్వాల్

దశాబ్ద కాలానికి పైగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగింది కాజల్ అగర్వాల్.ఈమె టాలీవుడ్ లోనే మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఉండేది.ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఇంటికి పరిమితమైన 100 కోట్లకు పైగానే ఆస్తులను సంపాదించింది.

5.నయనతార

లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార( Nayanthara ) 74 కోట్ల రూపాయల సంపాదన కలిగి ఉంది.ఆమె ఈ ఏడాది ఇద్దరు కవలలకు జన్మనిచ్చి సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది.

6.పూజా హెగ్డే

సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాల్లో నటిస్తున్న పూజా హెగ్డే ( Pooja Hegde )చాలామంది హీరోయిన్స్ తో పోలిస్తే ఎక్కువగానే సంపాదిస్తుంది.ప్రస్తుతం అమే కూడబెట్టిన అస్థి మొత్తం 55 కోట్ల పైమాటే.

7.రకుల్ ప్రీత్

ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఫామ్ కోల్పోతున్న రకుల్ ప్రీతి సినిమాలతో పాటు బిజినెస్ లోను అందజేసిన చెయ్యి.ఇక ఆమె సంపాదించిన డబ్బు విషయానికి వస్తే 45 కోట్లకు పైగానే కూడా పెట్టినట్టుగా సమాచారం.

8.రష్మిక మందన

ఈ ఏడాది పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది రష్మిక( Rashmika ).అయితే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో ఎదుగుతున్న ఈ హీరోయిన్ దాదాపు 45 నుంచి 50 కోట్ల వరకు ఆస్తులను కూడా పెట్టింది.

9.సాయి పల్లవి

సినిమాలో కథ నచ్చితే చాలు డబ్బుతో సాయి పల్లవి( Sai Pallavi )కి ఎలాంటి పని ఉండదు.అందుకే డబ్బు తక్కువగా వచ్చినా సరే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ అందరికంటే ఎక్కువ పేరు సంపాదించుకుంది.అందుకే సాయి పల్లవి దాదాపు 40 కోట్ల మేర మాత్రమే సంపాదించుకోగలిగింది.

10.కీర్తి సురేష్

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న కీర్తి సురేష్ 30 కోట్ల ( Keerthy Suresh )మీద ఆస్తులను కూడా పెట్టిందట.చాలామంది హీరోయిన్స్ తో పోలిస్తే కీర్తి సురేష్ ఇంకా తక్కువగానే రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

Top 10 Tollywood Richest Heroines

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube