దేశ రాజధాని ఢిల్లీలో ఐపీఆర్ లాయర్‌గా పనిచేస్తున్న తాన్యా శర్మకు( Tanya Sharma ) ఊహించని షాక్ తగిలింది.ఉబర్ బుక్ చేసుకున్న కొంత సేపటికే ఆమెకు డ్రైవర్ అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించి వేధింపులకు గురిచేశాడు.
ఈ విషయాన్ని స్వయంగా తాన్యా శర్మనే లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.ప్రయాణికుల భద్రతపై, ముఖ్యంగా మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాన్యా శర్మ ఉబర్( Uber ) యాప్‌లో ఆటో బుక్ చేసుకున్న వెంటనే డ్రైవర్ నుంచి మెసేజ్ వచ్చింది.“జల్దీ ఆవో బాబు యర్ర్.మన్ హో రహా హై (నేను మూడ్‌లో ఉన్నా)” అంటూ డ్రైవర్( Driver ) అసభ్యంగా మెసేజ్ పెట్టాడు.దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న తాన్య వెంటనే ఆ రైడ్‌ను క్యాన్సిల్ చేసుకుంది.
అంతేకాదు, ఉబర్ యాప్‌లో కంప్లైంట్ కూడా పెట్టింది.కానీ ఉబర్ ఇండియా స్పందించిన తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
“ఉబర్ ఏం చేస్తుందంటే.సానుభూతి చూపిస్తూ ఒక మెసేజ్ పంపుతుంది.
అంతే, ఆ తర్వాత దాని గురించి పూర్తిగా మరిచిపోతుంది.ఇదేనా మీ పనితీరు?” అంటూ తాన్యా శర్మ లింక్డ్‌ఇన్‌లో నిలదీసింది.తొలుత ఉబర్ కూడా యథావిధిగా “విచారణ చేస్తాం” అంటూ ఒక రొటీన్ మెసేజ్ పంపింది.సంఘటన జరిగిన 30 నిమిషాల్లో రెస్పాన్స్ టీమ్ కాంటాక్ట్ అవుతుందని చెప్పింది.
కానీ, ఫాలో-అప్‌లో మాత్రం 48 గంటల సమయం పడుతుందని చెప్పడంతో తాన్యా శర్మ మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది.
“ఒకవేళ ఈ 48 గంటల్లో ఇంకొంతమంది మహిళలకు ఇలాంటి అనుభవం ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారు?” అంటూ ఉబర్‌ను సూటిగా ప్రశ్నించింది.ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉబర్ సంస్థ దిగొచ్చింది.వెంటనే స్పందించి ఆ డ్రైవర్‌ను శాశ్వతంగా బ్లాక్ చేసింది.
నెటిజన్లు, తన శ్రేయోభిలాషులు మద్దతు ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందని తాన్యా శర్మ కృతజ్ఞతలు తెలిపింది.ఇలాంటి ఘటనలను తేలిగ్గా తీసుకోవద్దని, వెంటనే రిపోర్ట్ చేయాలని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించింది.ప్రతి ఒక్కరూ స్పందిస్తేనే సమాజంలో మార్పు వస్తుందని ఆమె పిలుపునిచ్చింది.
ఈ ఘటన మరోసారి రైడ్-హెయిలింగ్ సర్వీసుల్లో ప్రయాణికుల భద్రతపై చర్చకు దారితీసింది.
డ్రైవర్ల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ మరింత కఠినతరం చేయాలని, ఫిర్యాదుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.మహిళా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.