సమంత( Samantha ) ఇటీవల కాలంలో సినిమాల కంటే కూడా ఎక్కువగా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.ఇటీవల ఈమె సిటాడెల్( Citadel ) ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఈ వెబ్ సిరీస్ కంటే ముందుగా సమంత ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.అయితే ఈ సిరీస్ పార్ట్ వన్ లో సమంత నటించకపోయిన మీ ఫ్యామిలీ మెన్ 2 లో మాత్రం రా ఏజెంట్ గా రాజీ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు.
ఈ వెబ్ సిరీస్లలో సమంత హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా యాక్షన్ సన్ని వేశాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇక ఈ సిరీస్ మంచి సక్సెస్ కావడంతో దిఫ్యామిలీ మెన్ 3( Family Men 3 ) నిర్మాణం కూడా చేపట్టారు.రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ ఏడాది చివరికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అందుబాటులోకి రాబోతోంది.
ఇలా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్‌లో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి వేడుక నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో కలిసి సమంత సందడి చేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.ముఖ్యంగా దర్శకులు రాజ్ అండ్ డీకే తో కలిసి సమంత దిగిన ఫోటోల పైన అందరి చూపు ఉంది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే దర్శకులలో ఒకరైన రాజ్ తో సమంత ప్రేమలో ఉన్నారని తిరిగి ఆయనని రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో అందరి ఫోకస్ ఈ ఇద్దరిపైనే ఉందని చెప్పాలి.ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.