టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో రామ్ చరణ్( Star hero Ram Charan ) కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గేమ్ ఛేంజర్ సినిమా అశించిన ఫలితాన్ని అందుకోకపోయినా చరణ్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఈ ఏడాదే బుచ్చిబాబు సినిమాతో( Buchi Babu movie ) ప్రేక్షకుల ముందుకు రానున్న చరణ్ వచ్చే ఏడాది నుంచి సుకుమార్ డైరెక్షన్ లో సినిమాతో బిజీ కానున్నారు.
అయితే చరణ్ ఉపాసన తాజాగా సుకుమార్ కూతురు సుకృతి వేణిని ( Sukriti Veni )మెచ్చుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.
సుకృతి వేణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన గాంధీ తాత చెట్టు( Gandhi Thata chettu ) శుక్రవారం రోజున థియేటర్లలో విడుదల కాగా సుకృతి యాక్టింగ్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.పరిమిత సంఖ్యలో స్క్రీన్లలో రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

చరణ్ ఉపాసన గాంధీ తాత చెట్టు చిత్ర బృందాన్ని కలిసి సుకృతి వేణిని ఎంతగానో మెచ్చుకున్నారు.సుకృతి వేణి ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని చరణ్ ఉపాసన కోరారు.మైత్రీ మూవీ మేకర్స్ ( Mythri Movie Makers )బృందం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది.పిల్లలను ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలోని గాంధీ పాత్ర కోసం సుకృతి వేణి పడిన కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.నిజామాబాద్ జిల్లా అడ్లూర్ లో జరిగే కథతో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.గాంధీ తాత చెట్టు పరిమిత బడ్జెట్ తో తెరకెక్కగా కమర్షియల్ గా ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఒకవైపు కమర్షియల్ సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు మంచి అభిరుచి ఉన్న సినిమాలను నిర్మించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.