మానవశరీరంలా మెత్తగా ఉన్న మల్లూరు నరసింహ స్వామి విశిష్టత ఇదే..!

మన భారత దేశంలో ఎన్నో దేవాలయాలు ఎన్నో పేరుప్రఖ్యాతులు గాంచి ప్రసిద్ధి చెందాయి.అలాంటి వాటిలో శ్రీ నరసింహ స్వామి దేవాలయం ఒకటి.

 This Is The Uniqueness Of Mallur Narasimha Swamy Who Is As Soft As A Human Body-TeluguStop.com

హిరణ్య కశిపుడి ఆగడాలను అంతమొదించడానికి భక్త ప్రహ్లాదుడికి ముక్తిని ప్రసాదించడానికి విష్ణు పూర్తి ఎత్తిన అవతారమే నరసింహ అవతారం.ఆ నరసింహ స్వామి తన ఉనికిని చాటుకోవడం కోసం ఎన్నో దేవాలయాలు అవతరించాడు.

అలాంటి పుణ్యక్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది ఉన్నాయి.ఈ తొమ్మిది క్షేత్రాలను నవ నరసింహ క్షేత్రాలు అనే పిలుస్తారు.

ఈ 9 క్షేత్రాలలో మొట్టమొదటిగా ఎంతో ప్రసిద్ధి చెందిన మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి గా ప్రసిద్ధి చెందింది.ఈ లనరసింహ స్వామిలోని స్వామివారి విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

వరంగల్‌ జిల్లా మంగ పేట మండలంలో ఉన్న ఈ క్షేత్రంలో స్వామి హేమాచల లనరసింహ స్వామిక్ష్మీగా వేల సంవత్సరాల నుంచి పూజలందుకుంటున్నాడు.

మల్లూరు గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం హేమాచలం అనే కొండ మీద వెలసింది.పురాణ కథల ప్రకారం సాక్షాత్తు ఆ దేవ దేవతలే ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారాని చెబుతారు.

ఈ ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహం మానవ శరీరంలో మాదిరి మెత్తగా దర్శనమిస్తుంది.

Telugu Hinduhistorical, Mallursimha, Warangal-Telugu Bhakthi

ఈ ఆలయంలో ఉన్న స్వామి వారి విగ్రహం అచ్చం మానవ శరీరం వలె మెత్తగా ఉండటమే కాకుండా, ఛాతి మీద రోమాలు కూడా మనకు దర్శనమిస్తాయి.స్వామి వారి శరీరం ఎక్కడ తాకినా మెత్తగా ఉంటుంది.ఉదర భాగంలో బొడ్డు నుంచి ఎల్లప్పుడూ ఒక ద్రవం ఉంటుంది.

ఈ ద్రవాన్ని కట్టడి చేయడానికి ఆ భాగంలో గంధం పూస్తారు.ఆలయానికి వచ్చిన భక్తులకు ఆ గంధాన్ని ప్రసాదంగా ఇస్తారు.

పూర్వం ఈ విగ్రహాన్ని తరలిస్తున్న సమయంలో బొడ్డు దగ్గర చిన్న రంధ్రం పడిందని అక్కడి ప్రజలు చెబుతారు.ఈ విధంగా స్వామి వారి శరీరం మెత్తగా ఉండటానికి గల కారణాలు ఏమిటో ఇప్పటివరకు రహస్యంగానే మిగిలిపోయింది.

మల్లూరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థం ఎంతో మంది వస్తుంటారు.ఈ విధంగా 9 క్షేత్రాలలో హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విశిష్టత ఇదేనని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube