మనిషి ప్రశాంతంగా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని పరిధులను కల్పించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే లేనిపోని సమస్యలను( problems ) ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే అవమానాలు( Insults ) కూడా ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.ముఖ్యంగా ఈ అనవసర విషయాలు మనిషికి ముప్పును తెచ్చిపెడతాయి.
వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మీకు అవసరం లేని చోటుకి వెళ్లడం వల్ల లేదా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ విలువైన సమయం, శక్తి వృధా అవుతాయి.
దీనికి బదులుగా మీ నైపుణ్యాలను అవసరమయ్యే విషయాల పైన కేంద్రీకరించడం మంచిది.

దాని వల్ల మీ శక్తి, సామర్థ్యాలు వృథా అవుతాయి.ఇంకా చెప్పాలంటే మీరు అవసరం లేని చోటకు వెళ్ళినప్పుడు లేదా మీ సామర్థ్యాన్ని అనవసరం లేని విషయాలపై కేంద్రీకరించినప్పుడు మీకు తగిన గుర్తింపు, ప్రశంసలు అందకపోవచ్చు.ఇటువంటి సందర్భాలలో మీకు సహకారం అందుక పొగ మీ గుర్తింపు కూడా మరింత తగ్గే అవకాశం ఉంది.
మీకు అవసరం లేనప్పుడు ఇతరుల వ్యక్తిగతాల్లోకి చొరబడకపోవడమే మంచిది.ఎదుటివారు మీ సహాయం కోసం ప్రత్యేకంగా అడగనంతవరకు వారి వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు.మీరు ఉద్దేశపూర్వకంగా ఇతరుల శక్తిసామర్థ్యాలను అణగదొక్కే ప్రయత్నం అస్సలు చేయకూడదు.వారి నైపుణ్యాలపై నమ్మకం ఉంచాలి.
వారి బాధ్యతల( Responsibilities )ను వారు స్వతంత్రంగా నిర్వహించేలా చూసుకోవాలి.ఇందుకు అవసరమైతేనే సహకారం అందించాలి.
మీరు మీ దగ్గర ఉన్న వనరులను మీకు అవసరం లేని అంశాలపై మళ్లించినప్పుడు, అది మీ సమయం అయిన, డబ్బు అయినా వృధాకు దారిదిస్తుంది.

మీ దగ్గర ఉన్న వనరులను ద్విగుణీకృతం చేసుకునేందుకు వాటిని సమర్థవంతంగా ఉపయోగించడం ఎంతో ముఖ్యం.అలాగే మీరు లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అన్నీ కార్యకలాపాల( activities )కు ఇతరుల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది.మీరు కోరుకునే మార్పు మెరుగుదల కోసం ఇప్పటికే ఉన్న ప్రక్రియలను కొనసాగించాలి.
అంతేకాకుండా మీరు అవసరం లేని విషయాలలో తరచూ జోక్యం చేసుకోవడం వల్ల అది నిరాశకు దారితీస్తుంది.మీ ప్రయత్నాలను అనవసరమైన విషయాలపై పెట్టి సమయం వృధా( Waste of time ) చేసుకోకుండా విలువైన అర్థవంతమైన మార్పులను కలిగించగల అంశాలపై దృష్టి పెట్టడం ఎంతో మంచిది.