చిరంజీవి ఆ సినిమా చూసి తెగ బాదపడ్డారట..??

టాలీవూడ్ ఇండస్ట్రీలో స్వశక్తితో కష్టపడి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒక్కరు.ప్రస్తుతం చిరంజీవి వయస్సు అరవై ఏళ్ళ పైబడిన నిత్యం సినీ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.

 Why Chiranjeevi Sad About That Movie-TeluguStop.com

ఇక చిరంజీవి 150 దాటి మూవీస్ చేసినప్పటికీ కూడా ఇప్పటికి తన హుందాగా ఉంటారు.ఆయన ఎక్కడా గర్వాన్ని ప్రదర్శించకుండా చాలా సింపుల్ గా ఉండడానికి ఎక్కువుగా ఇష్టపడుతూ ఉంటారు.

ఇక అందుకేనేమో చిరంజీవి ఎంతో మంది నటులకు స్ఫూర్తి.

అంతేకాదు ఈ విషయాన్నీ పలు సందర్భాలలో పలువురు స్టార్స్ ఓపెన్ గా చెప్పుకొచ్చారు.

ఇక సున్నిత మనస్కుడైన చిరంజీవి ఒక స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాక కూడా ఓ సినిమా ఆయనని బాధ పెట్టిందట.అందేంటో ఒక్కసారి చూద్దామా.1986లో స్వాతిముత్యం విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.ఇక కమర్షియల్ సినిమాకు ధీటుగా విడుదలైన అన్నీ కేంద్రాల్లో వందరోజులు బొమ్మ ప్రదర్శించారు.

అయితే అందులో కమల్ హాసన్ నటన గురించి మాట్లాడుకోని ప్రేక్షకుడు అంటూ ఉండరు.ఇక దాని గురించి విన్న చిరంజీవి స్వాతిముత్యంని ప్రత్యేకంగా చూసాక, ఒక్కసారిగా నిరాశకి గురైయ్యారంట.

కాగా సుప్రీమ్ హీరో డైనమిక్ స్టార్ అనిపించుకుంటున్నాం మనకేం తక్కువ అనుకుంటున్న టైంలో స్వాతి ముత్యంలో కమల్ విశ్వరూపం చూసి తానెం కోల్పోతున్నానో చిరంజీవి అర్ధం చేసుకున్నారంట.ఇక ఇలాంటి పాత్ర నాకు రాలేదే అని బాధపడుతూ, ఇంత గొప్పగా పర్ఫార్మ్ చేసే సబ్జెక్టు నాకు దొరుకుతుందా అని ఓ రెండు మూడు రోజులు తెగ మధన పడ్డారంట చిరు.

Telugu Chiranjeevi-Movie

ఇక సరిగ్గా ఆ సమయంలో చిరుతో పాటు హీరోయిన్ సుహాసిని నటిస్తున్నారంట.అయితే ఎప్పుడూ హుషారుగా ఉండే చిరు డల్ గా ఉండటానికి కారణం అడిగి తెలుసుకున్నారంట.

Telugu Chiranjeevi-Movie

సుహాసిని చిరుతో ఇలా అన్నారంట గొప్ప నటులకు టైం వచ్చినప్పుడు అలాంటి కథ ప్రతీ ఒక్కరికి వస్తుందని అన్నారు.ఈ విషయాన్ని దర్శకుడు విశ్వనాథ్ కి అలాగే కమల్ కి చెప్పరంట.ఆ తరువాత ఆయన స్వయంకృషి’చిత్రం చేయడంతో తనకు ఆ లోటు తీరిందని చిరు చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube