టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Heroine Samantha ) గురించి మనందరికీ తెలిసిందే.సమంత తాజాగా నటించిన చిత్రం ఖుషి.
ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన విషయం తెలిసిందే.ఇటీవలె సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకొని దూసుకుపోతోంది.
అయితే ప్రస్తుతం సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చి విదేశాలలో గడుపుతున్న విషయం తెలిసిందే.అయితే ఖుషి సినిమా అమెరికాలో ఒక మిలియన్ డాలర్ క్లబ్ లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమె సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్న ఆమె అక్కడి వారిని కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ… ఖుషి సెలబ్రేషన్స్( Kushi Celebrations )లో భాగంగా ఈరోజు మీ అందరినీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది.దీనిని నేను నమ్మలేకపోతున్నాను.అమెరికాలోనే నా కెరీర్ ప్రారంభమైంది.నా కెరీర్ ఎదుగుదలలో భాగమైన ఇక్కడి వారిని కలవడానికి దాదాపు 13 ఏళ్లు పట్టింది.ఇప్పటివరకూ నేను నటించిన 16 చిత్రాలు 1 మిలియన్ డాలర్లు అందుకున్నాయి.
ఖుషి మూవీ( Kushi Movie )తో ఆ సంఖ్య 17కు చేరింది.అందుకు నేను ఎంతో గర్విస్తున్నాను మీరు నాపై చూపిస్తోన్న అమితమైన ప్రేమకు ధన్యవాదాలు.

గత నెల నుంచి యూఎస్‌లోనే పర్యటిస్తున్నాను.మా సినిమాపై మీరు చూపిస్తోన్న ప్రేమ గురించి విజయ్ దేవరకొండ( Vijay Deverakonda )తో చెబుతాను.నాకు తెలుసు మీకు ఆయన అంటే ఎంతో ఇష్టమని.ఇంటికి దూరంగా కొన్ని వేల మైళ్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చినప్పటికీ.ఇక్కడ ఉంటే నాకు నా ఇంట్లోనే ఉన్న భావన కలుగుతుంది అని సమంత చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.