సినిమా పరిశ్రమ అప్పుడు.ఇప్పుడు.
ఎప్పుడైనా కొందరి గుప్పిట్లో ఉంటుంది.వారు చెప్పినట్లే ఇండస్ట్రీ ముందుకు సాగుతుంది.
అయితే ఇండస్ట్రీని ఏలుతున్న పెద్దలను ధిక్కరించే ప్రయత్నం ఎవరు చేసినా.ఇండస్ట్రీ నుంచి తప్పుకునే పరిస్థితి వస్తుంది.
అందుకే వారిని మచ్చిక చేసుకునే పనుల్లో ఉంటారు చిన్నా చితకా నటులు.ఒకప్పుడు అద్భుత హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నగేష్ జీవితంలో జరిగిన ఘటన గురించి తెలుసుకుంటే.
ఇండస్ట్రీలో ఇగో ఎలా ఉంటుందో అర్థం అవుతుంది.
నగేష్ సినిమా రంగంలోకి రాకముందు రైల్వేలో ఉద్యోగం చేసేవాడు.
ఆయనకు చిన్నప్పటి నుంచే నటన అంటే మక్కువ ఎక్కువ ఉండేది.అందుకే ఎన్నో నాటకాల్లో వేశాలు వేశాడు.
ఆ నటనా అనుభవంతోనే సినిమా రంగంలోకి రావాలి అనుకున్నాడు.ఎన్నో ఇబ్బందులు పడి తమిళ సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.
చిన్న చితకా క్యారెక్టర్ల నుంచి అద్భుత నటుడి స్థాయికి ఎదిగాడు.ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన స్వతహాగా ఎదిగాడు.
స్వశక్తితో ఇండస్ట్రీలో నిలబడ్డాయి.అదే సమయంలో తమిళ స్టార్ హీరో ఎంజీఆర్, నగేష్ కు మధ్య కొన్ని మనస్పర్థలు జరిగాయి.
సెట్ లోకి ఎంజీఆర్ వచ్చినప్పుడు నగేష్ లేవలేదట.దీంతో ఎంజీఆర్ ఈగో బాగా హర్ట్ అయ్యిందట.
ఎంజీఆర్ నగేష్ కు సినిమా అవకాశాలు ఇవ్వొద్దని దర్శక నిర్మాతలకు చెప్పాడట.దీంతో ఆయనకు అవకాశాలు రాలేదు.
ఆ తర్వాత ఆయన తెలుగులో నటించాడు.

అనంతరం నగేష్ కు కమల్ హాసన్ తో చక్కటి స్నేహం ఉండేది.ఆయన మూలంగా మళ్లీ తమిళ సినిమా పరిశ్రమలో అవకాశాలు దక్కించుకున్నాడు.అదే సమయంలో సినిమా రంగంలోకి తన కొడుకును తీసుకువచ్చి హీరోగా చేయాలి అనుకున్నాడు.
అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు.అంతేకాదు.
తనకు ఉన్న ఓ థియేటర్ ట్యాక్స్ కట్టలేకపోయాడు.అప్పుడు సీఎంగా ఉన్న ఎంజీఆర్ ఈ కారణాన్ని పట్టుకుని నగేష్ ని జైలుకు పంపాడు.