రథ సప్తమి ఎందుకు చేస్తారో తెలుసా?

రథ సప్తమి పండుగ గురించి మనందరికీ తెలుసు.అయితే ఆరోజు ఉదయమే లేచి ఇంటి ముందు రథం ముగ్గు పెట్టడం.

 Importance Of Ratha Sapthami  Details, Ratha Sapthami, Ratha Sapthami Importance-TeluguStop.com

జిల్లెడు ఆకులతో స్నానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.అసలు రథ సప్తమి పండుగ ఎందుకు చేసుకుంటారు? దాని వెనుక కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

భూమిపై జీవరాశుల మనుగడకు సూర్యుడే కారణంమని మన పెద్దలు చెబుతుంటారు.అయితే రోజూ పొద్దునే లేచి మనం నమకస్కారం చేసే ఆ సూర్యభగవానుడిని ఆరాధించే రోజునే రథ సప్తమిగా జరుపుకుంటాం.

మాఘ మాసం శుక్ల పక్షం సప్తమి తిథిని ‘రథ సప్తమి’ జరుపుకుంటారు.సూర్య రథం దక్షిణాయనం ముగించి, పూర్వోత్తర దిశగా పయనం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.సూర్యోదయం ఉన్న సప్తమి రోజునే రథ సప్తమి పూజను ఆచరించాలి.ఈ సప్తమి సూర్య గ్రహణంతో సమానమైనదని పురాణాలు చెబుతున్నాయి.

అయితే ఈరోజు స్నానం చేసేటప్పుడు సూర్యుడిని ధ్యానించాలట.

ఆ తర్వాత ఇంటిల్లిపాదీ కలిసి గాయత్రీ జపం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య సహస్రం వంటి స్తోత్ర పాఠాలు వల్లిస్తూ పూజలు చేయడం చాలా మంచిదట.అలా చేస్తే కష్టాలు తొలగుతాయట.అంతే కాదు ఇంటిల్లిపాదీ ఆరోగ్యాలు బాగుంటాయట.

అంతే కాదండోయ్.రథ సప్తమి నాడు బంగారముతోగాని, వెండితోగాని, రాగితోగాని రథమును చేయించి.

కుంకుమ దీపాలతో అలంకరించి పూజ చేసి వాటిని మన గురువులకు దానం ఇవ్వాలట.అలా చేయడం వల్ల ఈ సూర్య భగవానుడి కృప మనపై ఉంటుందట.

Importance Of Ratha Sapthami Details, Ratha Sapthami, Ratha Sapthami Importance, Surya Bhagavan, Jilledu Leaves, Bath, Gayatri Japam, Shukla Paksham - Telugu Bath, Devotional, Gayatri Japam, Jilledu, Ratha Sapthami, Rathasapthami, Shukla Paksham, Surya Bhagavan

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube