అమ్మవారి విగ్రహం పాలు తాగుతోంది అంటూ...

అమ్మవారి విగ్రహం పాలు తాగుతోంది అంటూ … హడావుడి చేయడంతో ఆ వార్త వైరల్ గా మారి ఆ ఆలయం వద్ద తనోపతండాలుగా జనాలు గుమగుడిపోయారు.వివరాల్లోకి వెళ్తే…మండల కేంద్రం శంషాబాద్‌లోని కోటమైసమ్మ ఆలయంలోని విగ్రహం పాలు తాగుతుందని భక్తులంతా ఆ దేవాలయానికి చేరుకొని చెంచాలతో పాలు తాగించారు.

 Kota Maysamma Statue Is Drinking Milk At Shamshabad-TeluguStop.com

అయితే కొందరు తొలుత అమ్మవారి విగ్రహం నోటి వద్ద స్పూన్‌లో పాలు పోసి ఉంచగా ఆ పాలు క్రమక్రమంగా తగ్గిపోయాయి.ఈ విషయం తెలిసిన భక్తులు ఆలయం వద్దకు చేరుకొని పాలు తాగించేందుకు పోటీపడ్డారు.

నవరాత్రి ఉత్సవాలు ముగించుకున్న భక్తులు ఆ దేవాలయానికి చేరుకొని నైవేద్యంగా ఆవు పాలను సమర్పించారు.

ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దేవాలయం వద్దకు రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.కాగా దసరా పండుగ కావడంతో ఆ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు.అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ఆలయం లోపలి నుంచి గజ్జెల చప్పుడు వచ్చేదని ఆ బస్తీకి చెందిన భక్తులు తెలిపారు.

ఈ దేవాలయంలో కోటమైసమ్మతల్లి స్వయంభుగా వెసినందున నవరాత్రులప్పుడు మాతా తప్పకుండా దేవాలయంలోకి వస్తుందని భక్తుల నమ్మకం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube