చాలామందికి తాము అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి అవుతుంది.చాలా సందర్భాల్లో ప్రతి ఒకరికి ఇలాంటివి అవుతూ ఉంటాయి.
ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు మాత్రం అలా ఒకటి అనుకుంటే మరొకటి జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి.ఇప్పటికీ చాలామంది నటీనటులు మీడియా ముందుకు వచ్చి తాము అనుకున్న విషయాలన్నీ జరగలేదని చాలా చెప్పారు.
తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీకి కూడా అనుకున్నదొకటి జరిగింది ఒక్కటి అని తెలిపింది.హీరోయిన్ గా కాకుండా తను మరొకటి అవ్వాలని అనుకుందట.కానీ అనుకోకుండా హీరోయిన్ కావాల్సి వచ్చింది అని తెలిపింది.ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కాదు దిశాపటాని.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ దిశా పటాని.
తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2015 లోఫర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.
కానీ ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు అంతగా కలిసి రాలేదు.కానీ ఈ సినిమాలో తన అందాన్ని చూసి ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు.
ఆ తర్వాత 2016లో ms ధోని సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది.
ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు మంచి సక్సెస్ ఇవ్వడంతో ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.
దీంతో మంచి సక్సెస్ అందుకొని బాలీవుడ్ బ్యూటీ గా మిగిలిపోయింది.పైగా తనకు పలు అవార్డులు కూడా వచ్చాయి.ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అక్కడ తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది.

తను హీరోయిన్ గా నటించాలని అనుకోలేదట.తనకు పైలెట్ అవ్వాలని కోరిక ఉండటం తో డబ్బులు అవసరం కోసం మోడలింగ్ చేసిందట.అంతే కాకుండా ఎన్నో బ్రాండ్స్ కు సంబంధించిన కమర్షియల్స్ లో కూడా నటించిందట.
ఇక ఆ సమయంలోనే తనకు లోఫర్ సినిమాలో అవకాశం వచ్చిందని.కాదనుకోలేక కమిట్ అయ్యానని తెలిపింది.

ఆ సినిమా సక్సెస్ అవ్వకపోవటంతో తనకు సినిమాలు పడవు అని అనుకొని.మళ్లీ మోడలింగ్ చేసుకుంటూ ఆ కల నెరవేర్చుకుంది అనుకుందట.కానీ ఆ సమయంలో మళ్లీ తనకు ధోని సినిమాలో అవకాశం రావడంతో కాదన్న లేకుండా చేసిందట.ఇక ఆ సినిమా మంచి సక్సెస్ రావడంతో తనకు వరుస అవకాశాలు వచ్చాయని తెలిపింది.

ఇక కొన్ని సినిమాలలో నటించిన తర్వాత మళ్లీ ఫైలెట్ అవ్వాలని అనుకుందట.అలా తన జీవితంలో ఏ ఒక్క విషయం కూడా అనుకున్నట్లుగా ముందుకు సాగడం లేదట.తను ఒకటి అనుకుంటే మరేదో అవుతుంది అని.అలా ఇప్పుడు హీరోయిన్ అయ్యాను అని అన్నది.జీవితం అంటేనే ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది అని.ప్రతి సందర్భంలో కూడా తనను తను సర్దుకుంటే చెప్పుకుంటూ తన జీవితంలో ముందుకు వెళ్తున్నాను అంటూ తెలిపింది.ఇక ప్రస్తుతం ఈమె పలు ప్రాజెక్టులలో బిజీగా ఉన్నట్లు తెలిసింది.







