పీక్ స్టేజ్‌కు కుల పిచ్చి... స్వీట్ షాపుపై కులం కార్డు

జనాల్లో కులపిచ్చి పీక్ స్టేజ్ కు చేరుకుంటోంది.ప్రతిదానిలోకి కుల పిచ్చి చొచ్చుకోచ్చింది.

 Cast Name On Sweet Shop Board Viral Details, Sweet Shop, Viral Latest, News Vira-TeluguStop.com

రాజకీయాల్లో కుల గజ్జి అనేది మాములు అయిపోయింది.కులం పేరు చెప్పి ఓట్లు అడిగే నాయకులను మనం చూస్తూనే ఉన్నాం.

ఇక ఉద్యోగాల్లోనూ, కార్పొరేట్ ఆఫీసుల్లోనూ కుల గజ్జి బాగా ఎక్కువైపోయింది.ఇక కాలేజీల్లో అయితే కులం ఆధారంగా విద్యార్థులు విడిపోయి గొడవలు పడే స్థాయికి వెళ్లిపోయారు.

ఇలా ఎక్కడ పట్టినా కులం.కులం అంటూ జనాలు కొట్టుకుంటున్నారు.

కుల గజ్జి ఒక క్యాన్సర్ లా వ్యాపించి జనాలను సామాజికవర్గాల వారీగా విడగొడుతోంది.తమ కులం వాళ్లకే ఇళ్లు అద్దెకు ఇస్తామంటూ టూలెట్ బోర్డులు పెట్టుకుంటున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కొకోల్లలు.

ఇళ్లు అద్దె కోసం వెళితే మీది ఏ కులం అని అడిగి కాని అద్దెకు ఇవ్వడం లేదు.ఇలా ప్రతిచోట కులం రాజ్యమేలుతోంది.తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒక స్వీట్ షాపు బోర్డు చూస్తే కుల పిచ్చి ఏ స్థాయికి చేరిందో తెలుస్తోంది.ధనలక్ష్మి కిరాణా అండ్ స్వీట్స్ అని ఉన్న షాప్ బోర్డుపై ‘మేము కాపులం’ అని రాసి ఉంది.

కులం పేరును షాపు బోర్డుపై ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

తమ కులం గొప్పదని చెప్పకోవడానికి ఇలా పెట్టుకున్నారా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది తెలియడం లేదు.ఈ బోర్డును చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.కేవలం కాపు కులం వారికే ఇక్కడ సరుకులు, స్వీట్స్ అమ్ముతారా? వేరే కులం కులం వారికి అమ్మరా? అని ప్రశ్నిస్తున్నారు.నీ కులపిచ్చి తగలెయ్యా అంటూ మరికొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు.ఇలా వ్యాపారాలు చేసే చోట కూడా కులపిచ్చి ఏంటీ అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube