ప్రస్తుత రోజుల్లో సంతానలేమికి గురవుతున్న దంపతుల భారీగా పెరిగి పోతోంది.పెళ్లై ఏళ్లు గడిచినా సంతానం కలగకపోతే.
ఆ దంపతుల జీవితంలో ఏదో వెలితిగానే ఉంటుంది.పైగా ఇరుగు పొరుగు వారి సూటి పోటి మాటలకు ఇంకా కృంగిపోతుంటారు.
అయితే పిల్లలు కలగకపోవడానికి స్త్రీ, పురుషుల్లో ఉండే సంతానలేమి లోపాలే.ఆ లోపాలను నివారించడంలో వెల్లుల్లి పాలు అద్భుతంగా సమాయపడతాయి.
మరి ఆ వెల్లుల్లి పాలు ఎలా తయారు చేసుకోవాలి.? అసలు వెల్లుల్లి పాలు తాగడం వల్ల వచ్చే లాభాలు ఏంటీ.? వంటి విషయాలను లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గిన్నెలో గ్లాస్ పాలు పోసి వేడి చేయాలి.
కాస్త వేడిగా అయిన తర్వాత పొట్టు తీసి శుభ్రం చేసిన రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను దంచి పాలల్లో వేసి బాగా మరిగించాలి.ఆపై పాలను వడబోసుకుని అందులో ఒక స్పూన్ తేనె కలిపి సేవించాలి.
ఇలా రోజుకు ఒక సారి తీసుకుంటే.వెల్లుల్లి పాలల్లో ఉండే పలు పోషకాలు స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తాయి.
మరియు అండాశయ సమస్యలేమైనా ఉన్నా నివారించి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి.

అలాగే వెల్లుల్లి పాలను సేవించడం వల్ల పురుషుల్లో వీర్య వృద్ధి జరుగుతుంది.అంగస్తంభన, శుక్రకణాలు ఉత్పత్తి లేకపోవటం వంటి సమస్యలు దూరం అవుతాయి.మరియు లైంగిక సామర్ధ్యం రెట్టింపు అవుతుంది.
అందుకే సంతాన లేమితో బాధ పడే దంపతులు వెల్లుల్లి పాలను తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇక వెల్లుల్లి పాలను సేవించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.ఎముకలు, దంతాలు బలంగా మారతాయి.
మరియు నిద్ర లేమి సమస్య కూడా దూరం అవుతుంది.