ముల్లంగిని ప్రపంచ వ్యాప్తంగా ఒక దుంపగానే తింటున్నారు.అయితే ముల్లంగి యొక్క అన్ని బాగాలను వంటల్లో ఉపయోగించవచ్చు.
ముల్లంగి ఉత్తమమైన కురగాయాలలో ఒకటిగా ఉంది.ముల్లంగి విత్తనాలు,వేరు,ఆకులు అన్నింటిని కూరల్లో ఉపయోగించవచ్చు.
ముల్లంగిని ఆహారంలో పచ్చి సలాడ్ లేదా కూరగాయల రూపంలో చేర్చవచ్చు.అయితే ముల్లంగిలో కంటే ముల్లంగి ఆకులో ఎక్కువ పోషకాలు ఉన్నాయి.ముల్లంగి ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
1.ఖనిజాలు మరియు విటమిన్లు :
ముల్లంగి ఆకులో శరీరానికి అవసరమైన అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి.ఇవి శరీరం యొక్క పనితీరును మేరుగుపరచటంలో సహాయపడతాయి.
ముల్లంగి ఆకులో కాల్షియం, భాస్వరం, ఇనుము వంటి ఖనిజాలు,విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం ఉంటాయి.ఇవి శరీరంలో అనేక విధులను నిర్వర్తించటానికి సహాయపడతాయి.

2.క్యాన్సర్ ని నిరోదిస్తుంది:
ముల్లంగి ఆకు క్యాన్సర్ ని నిరోధిస్తుంది.ముల్లంగి కంటే ముల్లంగి ఆకులోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ముల్లంగి ఆకులో ఉండే ఖనిజాలు క్యాన్సర్ రూపాన్ని నివారించటానికి సహాయపడతాయి.ముల్లంగి ఆకులు పునరుత్పత్తి వలన ఏర్పడిన క్యాన్సర్ కణాలను తొలగించటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.
3.పైబర్ సమృద్దిగా ఉంటుంది:
ముల్లంగి ఆకులు జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో చాలా ప్రభావవంతముగా పనిచేస్తాయి.జీవక్రియకు అవసరమైన పైబర్ ముల్లంగి ఆకులో సమృద్దిగా ఉంటుంది.
అంతేకాక కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యల చికిత్సలో సహాయపడుతుంది.ముల్లంగితో పోలిస్తే ముల్లంగి అకులోనే ఎక్కువ పైబర్ ఉంటుంది.

4.పైల్స్ కి చికిత్స:
ముల్లంగి ఆకులు పైల్స్ చికిత్సలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.ముల్లంగి ఆకులలో ప్రత్యేకమైన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి.Cancer, ఎండిన ముల్లంగి ఆకులను పొడి చేయాలి.ముల్లంగి ఆకుల పొడి,పంచదారను సమాన పరిమాణంలో తీసుకోని నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి.ఈ పేస్ట్ ని తినవచ్చు.లేదా పైల్స్ ప్రభావిత ప్రాంతంలో రాయవచ్చు.
5.చర్మ లోపాలకు చికిత్స:
ముల్లంగి ఆకులు చర్మ లోపాలను నయం చేయటంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.ముల్లంగి ఆకులలో ఉండే ఖనిజాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి.
ముల్లంగి ఆకులో ఉండే క్రిమినాశక లక్షణాలు అన్ని రకాల చర్మ లోపాలను నయం చేయటంలో సహాయపడతాయి.అలాగే పగుళ్లు, దద్దుర్లు మరియు పొడి చర్మం వంటి సమస్యలు నయం అవుతాయి.