మామిడికాయ పొడిని మన దేశంలో ఆమ్చూర్ అని పిలుస్తారు.మామిడికాయ పొడి మార్కెట్ లో దొరుకుతుంది.
అలాగే మనం ఇంటిలో కూడా తయారుచేసుకోవచ్చు.మామిడి కాయలు వచ్చే వేసవిలో మామిడికాయను ముక్కలుగా కోసి ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవాలి.
ఈ పొడిని అనేక వంటల్లో ఉపయోగిస్తాం.మామిడికాయ పొడితో వంటకు రుచి పెరగటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
జీర్ణక్రియను మెరుగుపరచి అజీర్ణం,మలబద్దకం,గ్యాస్ వంటి సమస్యల నుండి బయట పడేలా చేస్తుంది.
ప్రతి రోజు వంటల్లో చిటికెడు మామిడికాయ పొడి వేస్తే చాలు.మామిడికాయ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణక్రియలో సహాయపడి కేలరీలు బాగా ఖర్చు అయ్యి బరువు కూడా తగ్గుతారు.
ఈ పొడిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన విటమిన్ సి లోపంతో బాధపడేవారికి మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు.అలాగే చర్మాన్ని శుభ్రం చేయటంలో కూడా బాగా సహాయపడుతుంది.
అంతేకాక కంటి చూపు, కంటి సంబంధిత సమస్యలను తగ్గించటంలో బాగా హెల్ప్ చేస్తుంది.మామిడికాయ పొడిలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన రక్తహీనతతో బాధపడేవారికి అద్భుతంగా పనిచేస్తుంది.
మామిడిపొడిలో కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన వ్యాధి నిరోధకతను పెంచి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.అంతేకాక మెగ్నీషయం, ఫాస్పరస్, క్యాల్షియం, మరియు పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన బిపి కూడా కంట్రోల్ లో ఉంటుంది.