ఎర్రటి పెదవులను ఎవరు కోరుకోరు చెప్పండి ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో అస్సలు రాజీపడరు.పెదాలు ఎర్రగా ఉంటే అందం మరింత పెరుగుతుంది.
అందుకే పెదాలను ఎర్రగా మార్చుకునేందుకు లిప్ బామ్, లిప్ కేర్ ఇలా రకరకాల ప్రోడెక్ట్స్ వాడుతుంటారు.అయితే పాలతో కూడా పెదాలు ఎర్రగా, మృదువుగా మార్చుకోవచ్చు.
మరి పాలను పెదాలకు ఎలా యూజ్ చేయాలి అన్న విషయం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్ రూట్ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్‌లో రెండు స్పూన్ల పాలు, ఒక స్పూన్ బీట్ రూట్ రసం మరియు తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేసి పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా రోజులో రెండు, మూడు సార్లు చేస్తూ ఉంటూ నల్లని పెదాలు ఎర్రగా, మృదువుగా మారతాయి.
అలాగే కొన్ని పాలు తీసుకుని అందులో కొన్ని ఎర్రటి గులాబీ రేకులు వేసి నాన బెట్టు కోవాలి.బాగా నానిన తర్వాత మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌ను పెదాలకు అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే ఖచ్చితంగా పెదాలు ఎర్రగా, అందంగా మారతాయి.
ఇక ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల పాలు, అర స్పూన్ చందనం పొడి వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాలకు పూసి.బాగా ఆరనివ్వాలి.ఆ తర్వాత తడి వేళ్లతో మెల్ల మెల్లగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే డార్క్ నెస్, డెడ్ స్కిన్ సెల్స్ పోయి పెదవులు ఎర్రగా, కాంతివంతంగా అవుతాయి.