హెయిర్ ఫాల్. దాదాపు అందరినీ వేధించే సమస్యే అయినా, కొందరిలో ఇది కాస్త హెవీ ఉంటుంది.
ఇలాంటి వారు హెయిర్ ఫాల్‌ను నివారించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు.రకరకాల షాంపూలు, ఆయిల్స్, సీరమ్స్ వాడుతుంటారు.
అయినప్పటికీ ఫలితం లేకుంటే వైద్యులను కూడా సంప్రదిస్తుంటారు.మీరు కూడా హెయిర్ ఫాల్ తో తీవ్రంగా విసిగిపోయారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే హోం రెమెడీని ట్రై చేస్తే చాలా సులభంగా మరియు వేగంగా హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేయవచ్చు.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి వాటర్‌తో వాస్ చేసుకోవాలి.
ఆపై ఒక కప్పు వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.ఈలోపు ఒక బీట్‌రూట్‌ను తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న బియ్యం, కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, గ్లాస్ వాటర్ వేసుకుని ఇరవై నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి.

ఇలా ఉడికించుకున్న పదార్థాలను చల్లారబెట్టుకుని.అప్పుడు మిక్సీ జార్‌లో మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసి.
జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారంలో రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే.ఎంత తీవ్రమైన హెయిర్ ఫాల్ అయినా క్రమంగా అదుపులోకి వస్తుంది.
అదే సమయంలో జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.