మాంసాహారం తీసుకునే వారికి ఎక్కువగా ఇష్టం అయిన వంటకం చికెన్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఎందుకంటే మనదేశంతో పాటు, ప్రపంచంలోనే అత్యధికంగా చికెన్‌ను తింటున్న వారు.
ప్రతి రోజు కొన్ని కోట్ల మంది చికెన్ తింటూ ఉంటారు.మటన్ రేటు సామాన్యులకు దూరంగా ఉండటంతో పాటు, చికెన్ కాస్త రేటు తక్కువ అవ్వడం, రుచికి రుచి కూడా ఉండటం వల్ల ఎక్కువ మంది చికెన్‌ను తినేందుకు ఆసక్తి చూపుతున్నారంటూ ఒక సర్వేలో వెళ్లడి అయ్యింది.
అయితే చికెన్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు అంటూ కొందరు ఆందోళన చెందుతూ ఉన్నారు.వాటిపై తాజాగా క్లారిటీ వచ్చింది.
చికెన్ తినేవారిలో ముఖ్యంగా ఉండే భయం వేడి చేస్తుందేమో అనుకుంటారు.అయితే చికెన్ తినే వారు ఎంతో మంది కూడా వేడి చేస్తుందని ఎక్కువ తినకుండా ఉండటం, వారు చికెన్ తిన్నా కూడా భయపడుతూ ఉండటం చేస్తూ ఉంటారు.
చికెన్ తినే సమయంలో భయపడుతూనే ఉంటారు.కొన్ని సార్లు వేడి చేయడం, అజీర్తి చేయడం వంటివి జరుగుతాయి.ఆ టైంలో బాబోయ్ మళ్లీ చికెన్ తినొద్దని అనుకుంటారు.కాని మళ్లీ వారం రోజులకే చికెన్ తింటూ ఉంటారు.
అయితే చికెన్ తిన్న సమయంలో ఇబ్బంది పడకుండా ఉండాలంటే, వేడి చేయకుండా ఉండాలి అంటే కాస్త కష్టపడాలి అంటున్నారు వైధ్యులు.
కుస్తీ పట్టే వారు, క్రీడాకారులు ఎక్కువగా చికెన్ తింటూ ఉంటారు.
వారు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల వారు చికెన్ తిన్నా కూడా వేడి అనేది ఉండదు.అందుకే చికెన్ తినే వారు మామూలు వారు అయినా కూడా తిన్న తర్వాత కనీసం అర్థగంట పాటు వాకింగ్ చేయడం లేదంటే 15 నిమిషాల పాటు ఏదైనా జిమ్ వర్కౌట్ చేయాలని, లేదంటే మరేదైనా పని చేస్తే ఆ చికెన్ అనేది అరగడం వల్ల వేడి చేయదని నిపుణులు చెబుతున్నారు.
మరెందుకు ఆలస్యం ఇష్టం వచ్చినట్లుగా తినండి, తిన్న తర్వాత కాస్త అది అరిగేలా కష్టపడండి.
అందరికి ఉపయోగపడే ఈ విషయాన్ని షేర్ చేయండి.