చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లో డీ-టాన్ చేసే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!

ప్ర‌స్తుత వేసవికాలంలో చాలా మందిని సన్ టాన్( Sun Tan ) అనేది బాగా ఇబ్బంది పెడుతుంది.ఎక్కువ సమయం పాటు సూర్యరశ్మి కి గురి కావడం వల్ల మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది.

 Power Home Remedy For De-tan Your Skin Details, Home Remedy, De-tan Skin, Sun T-TeluguStop.com

దీని కారణంగా చర్మం నల్లగా కందిపోయినట్లు అవుతుంది.దీన్నే టానింగ్ అని అంటారు.

సన్ టన్ వల్ల చర్మం కాంతిహీనంగా మారిపోతుంది.నల్లగా తయారవుతుంది.

అయితే అటువంటి చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లో డీ-టాన్ ( De-Tan ) చేసే పవర్ ఫుల్ రెమెడీ ఒకటి ఉంది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిటికెడు కుంకుమ పువ్వు( Saffron ) మరియు ఐదారు టేబుల్ స్పూన్ల పాలు( Milk ) తీసుకుని బాగా కలిపి అరగంట పాటు వదిలేయాలి.ఆ తర్వాత మరొక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ ములేటి పొడి వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు సరిపడా కుంకుమపువ్వు పాలు వేసుకొని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, De Skin, Skin, Healthy Skin, Remedy, Honey, Milk, Saffron, Skin Car

ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీ చర్మంపై చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.చందనం పొడి, ములేటి పొడి, కుంకుమ పువ్వు, పాలు, తేనె ఇవన్నీ టాన్ అయిన చర్మాన్ని రిపేర్ చేస్తాయి.నిమిషాల్లో డీ-టాన్ చేస్తాయి.చికాకును, ఎరుపును తగ్గిస్తుంది.మళ్లీ మీ చర్మం తెల్లగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.

Telugu Tips, De Skin, Skin, Healthy Skin, Remedy, Honey, Milk, Saffron, Skin Car

అంతేకాకుండా ఈ సింపుల్ చిట్కాను పాటించడం వల్ల స్కిన్ హైడ్రేటెడ్ గా మారుతుంది.చర్మం పై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్ పూర్తిగా రిమూవ్ అవుతాయి.చర్మానికి సహజ మెరుపు వస్తుంది.మృదువుగా మారుతుంది.కాబట్టి ఇంట్లోనే ఈజీగా స్కిన్ ను డీ-టాన్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube