మన శరీరంలో ఎముకలు( Bones ) అనేవి కీలక పాత్రను పోషిస్తాయి.శరీరం మొత్తం ఎముకల నిర్మాణం పైనే ఆధారపడి ఉంటుంది.
అందువల్ల ఎముకలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం.అయితే ఎముకల ఆరోగ్యానికి సహాయపడే ఆహారాలు కొన్ని ఉన్నాయి.
అటువంటి ఆహారాల్లో నువ్వులు( Sesame ) ఒకటి.ఎముకల దృఢత్వానికి అవసరమయ్యే కాల్షియం, మెగ్నీషియం, జింక్ తో సహా ఎన్నో పోషకాలు నువ్వుల్లో ఉంటాయి.
ముఖ్యంగా నువ్వులను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే 60లోనూ మీరు పరుగులు పెడతారు.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి.
అలాగే మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు,( Dates ) వన్ టేబుల్ స్పూన్ పీనట్ బటర్( Peanut Butter ) మరియు ఒక చిన్న కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు పాలు పోయాలి.
పాలు కాస్త మరిగిన తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న నువ్వుల మిశ్రమాన్ని వేసి మరో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.
![Telugu Dates, Tips, Healthy, Latest, Milk, Peanut Butter, Sesame Milk, Sesame Se Telugu Dates, Tips, Healthy, Latest, Milk, Peanut Butter, Sesame Milk, Sesame Se](https://telugustop.com/wp-content/uploads/2024/04/Take-this-sesame-milk-for-strong-and-healthy-bones-detailsa.jpg)
ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత నువ్వుల పాలును( Sesame Milk ) సేవించాలి.లేదా పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూడా తీసుకోవచ్చు.ఈ నువ్వుల పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేశాయి.
ముఖ్యంగా ఎముకలను హెల్తీగా మరియు సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తాయి.ఎముకలకు అవసరమయ్యే పోషకాలను చేకూరుస్తాయి.
ఎముకల్లో సాంద్రతను పెంచుతాయి.మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటాయి.
కండరాల నిర్మాణానికి కూడా ఈ నువ్వుల పాలు ఎంతగానో సహాయపడతాయి.
![Telugu Dates, Tips, Healthy, Latest, Milk, Peanut Butter, Sesame Milk, Sesame Se Telugu Dates, Tips, Healthy, Latest, Milk, Peanut Butter, Sesame Milk, Sesame Se](https://telugustop.com/wp-content/uploads/2024/04/Take-this-sesame-milk-for-strong-and-healthy-bones-detailss.jpg)
కాబట్టి ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే తప్పకుండా నువ్వుల పాలును నిత్యం తీసుకోండి.పైగా ఈ నువ్వుల పాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి.గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అలాగే ఈ నువ్వుల పాలులో ఐరన్ కంటెంట్ మెండుగా ఉంటుంది.రక్తహీనతతో బాధపడుతున్న వారు రోజు ఈ నువ్వుల పాలు తీసుకుంటే ఆ సమస్య నుంచి సులభంగా బయటపడతారు.