హెయిర్ ఫాల్( Hair fall ) అనేది ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతో మందిని కలవరపెట్టే కామన్ సమస్య.పోషకల కొరత, కాలుష్యం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను వినియోగించడం, రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేసుకోవడం, హార్మోన్ చేంజ్, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది.
ఈ సమస్య నుండి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ టానిక్ మీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ టానిక్ హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేయడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది.మరి ఇంతకీ ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు( onion slices ), నాలుగైదు దంచిన వెల్లుల్లి రెబ్బలు( Garlic cloves ) వేసుకోవాలి.
అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), రెండు రెబ్బలు కరివేపాకు వేసి పదినిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.
గోరువెచ్చగా అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ లేదా విటమిన్ ఈ ఆయిల్ వేసి మిక్స్ చేస్తే మన టాటిక్ అనేది రెడీ అవుతుంది.

ఒక స్ప్రే బాటిల్ లో తయారు చేసుకున్న టానిక్ తో నింపుకుని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.ఆపై ఒక పది నిమిషాల పాటు తల మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ టానిక్ ను కనుక వాడితే జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి.జుట్టు రాలే సమస్య క్రమంగా దూరమవుతుంది.

అలాగే ఈ టానిక్ ను వాడడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.ఇది హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.అంటే జుట్టు రాలడం తగ్గి దట్టంగా పెరగడం స్టార్ట్ అవుతుంది.అంతేకాకుండా ఈ టానిక్ ను వాడడం వల్ల చుండ్రు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.స్కాల్ప్ హెల్తీగా మారుతుంది.