వర్షాకాలం వచ్చేసింది.తెలంగాణలో ఇప్పటికే తుఫాను మొదలైంది.
వర్షాకాలం అంటే మనకు మట్టివాసన గుర్తుకువస్తుంది, పచ్చని చెట్లు గుర్తుకువస్తాయి.కాని సీజన్ అన్నాక అన్ని పాజిటివ్ పాయింట్లే ఉండవు కదా.నెగెటివ్ పాయింట్లు కూడా ఉంటాయి.వానకాలంలో బురద ఉంటుంది, నీళ్ళు ఆగే గుంటలు ఉంటాయి, దోమలు ఉంటాయి, ఇంఫెక్షన్లు ఉంటాయి, జ్వరాలు కూడా ఉంటాయి.
సీజనల్ మార్పు వలన రకరకాల జ్వరాలు వస్తాయి.అందులో ఉన్న అతిప్రమాదకరమైన జ్వరాల్లో ఒకటి డెంగ్యూ.మనిషిని చావు దాకా కూడా తీసుకెళ్ళగలిగే ఈ జ్వరం ఈ సీజన్ లో చాలామందికి వస్తుంది.అందుకే జాగ్రత్తగా ఉండండి.
ఈ టిప్స్ పాటించండి.బొప్పాయి ఆకులు డెంగ్యూ మీద బాగా పనిచెస్తాయని మీకు తెలుసు.
బొప్పాయి రసం కూడా రోగనిరోధకశక్తిని పెంచి డెంగ్యూ వచ్చే అవకాశాల్ని తగ్గిస్తుంది.ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది.
విటమిన్ సి అంటే గుర్తొచ్చింది, జామకాయ తినండి.రోజుకి ఒకటి రెండు తినండి.
జామలో కూడా ఈ విటమిన్ బాగా ఉంటుంది.అదనంగా ఫైబర్ ఉంటుంది నారింజ రసం, నిమ్మ రసం రోజూ తాగండి.
సిట్రస్ ఫ్యామిలి అంటే విటిమిన్ సికి పెట్టింది పేరు.తప్పకుండా సహాయపడతాయి.
ఈ కాలంలో బ్లడ్ ప్లెట్లెట్స్ బాగా ఉండటం అత్యవసరం.అలాగే ఒంటికి యాంటిఆక్సిడెంట్స్ అందుతూ ఉండాలి.
అప్పుడే డెంగ్యూ ప్రమాదం తగ్గుతుంది.ఇవన్ని దానిమ్మలో దొరుకుతాయి.
ఎమినో ఆసిడ్ కూడా బ్లడ్ ప్లెట్లెట్స్ ని పెంచుతుంది.ఇది కలబందలో బాగా దొరుకుతుంది.
కలబంద ని డైరెక్ట్ గా తినడం వల్ల కాకపోతే, కొంచెం తేనే కలుపుకోని జ్యూస్ లా తయారుచేసుకోని తాగండి.పసులు ఒక సహజమైన యాంటిఆక్సిడెంట్.
ఇది యాంటి ఫంగల్ కూడా.వర్షాకాలంలో వచ్చే ఎన్నో ఇంఫెక్షన్స్ ని అడ్డుకుంటుంది పసుపు.
దీన్ని వంటకాల్లో ఎక్కువ వాడండి.వేపాకులని నీటిలో మరిగించి, ఆ నీటినే పొద్దున్న ఓసారి, సాయంత్రం ఓసారి తాగండి.
ఇమ్యూనిటి లెవల్స్ ఇలా కూడా పెరుగుతాయి.