తమ పెదాలు గులాబీ రంగులో మెరిసి పోవాలని అందరూ కోరుకుంటారు.ముఖ్యంగా మగువలు పెదాలను గులాబీ రంగులోకి మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
తోచిన చిట్కాలు అన్నీ ప్రయత్నిస్తుంటారు.ఖరీదైన లిప్ బాంబ్స్, మాయిశ్చరైజర్స్ తదితర ఉత్పత్తులను వాడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరంను మీరు వాడాల్సిందే.
ఈ సీరం మీ పెదాలను సహజంగానే గులాబీ రంగులోకి మార్చి.అందంగా మరియు మృదువుగా మెరిసేలా చేస్తుంది.మరి ఇంతకీ ఆ సీరంను ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ ను తీసుకుని అందులో ఒక కప్పు ఎండిన గులాబీ రేకులను వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు గులాబీ రేకుల పొడి, అరకప్పు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక రోజంతా వదిలేయాలి.
మరుసటి రోజు పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ లో వన్ టేబుల్ స్పూన్ ప్యూర్ వెజిటేబుల్ గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే సీరం సిద్ధమైనట్లే.
ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు పెదాలకు ఉన్న లిప్ స్టిక్ ను పూర్తిగా తొలగించి వాటర్ తో వాష్ చేసుకోవాలి.
అనంతరం తయారు చేసుకున్న సీరంను పెదాలకు అప్లై చేసి వేళ్ళతో సున్నితంగా కాసేపు మసాజ్ చేసుకోవాలి.ఇలా ప్రతిరోజు కనుక చేస్తే ఎంత నల్లగా ఉన్న పెదాలైనా కేవలం కొద్ది రోజుల్లోనే గులాబీ రంగులోకి మారతాయి.మరియు కోమలంగా పెదాలు మెరుస్తూ కనిపిస్తాయి.