చలికాలంలో ఆరోగ్యానికి అండగా బత్తాయి.. రోజు తింటే ఊహించని లాభాలు మీ సొంతం!

ప్రస్తుత చలి కాలంలో విరివిరిగా లభ్యమయ్యే పండ్లలో బత్తాయి( Orange ) ఒకటి.తీపి, పులుపు రుచులను కలగలసి ఉండే బత్తాయి పండ్లను పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు.

 Wonderful Health Benefits Of Mosambi Fruit! ,mosambi Fruit, Mosambi Fruit Health-TeluguStop.com

కొంద‌రు బ‌త్తాయి పండ్ల‌తో జ్యూస్ త‌యారు చేసుకుని తాగుతుంటారు.ప్రస్తుత ఈ చలికాలంలో బత్తాయి పండ్లను తిన్నా, జ్యూస్ చేసుకుని తాగినా ఊహించని లాభాలు మీ సొంతమవుతాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం చ‌లికాలం( Winter Season )లో ఆరోగ్యానికి అండగా నిలిచే బ‌త్తాయి వ‌ల్ల ఏయే ప్ర‌యోజ‌నాలు పొందొచ్చో తెలుసుకుందాం పదండి.వింటర్ సీజన్ వచ్చిందంటే దాదాపు అందరి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది.

Telugu Tips, Latest, Mosambi Fruit, Mosambifruit, Season-Telugu Health

అయితే బత్తాయి పండ్లు ఇమ్యూనిటీ బూస్టర్( Immunity Booster ) గా పని చేస్తాయి.బత్తాయి లో విటమిన్ సి మెండుగా ఉంటుంది.అందువల్ల రోజుకు ఒక బత్తాయి పండును తింటే మన రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.దాంతో జలుబు, దగ్గు వంటి సీజనల్‌ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

ఒకవేళ వచ్చినా వాటిని త్వరగా జ‌యిస్తారు.అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న వారు తప్పకుండా బత్తాయి పండ్లను డైట్ లో చేర్చుకోండి.

బత్తాయి లో ఉండే పోషకాలు మూత్రాశయాన్ని శుభ్రంగా ఆరోగ్యంగా మారుస్తాయి.ఇన్ఫాక్ష‌న్స్ ను నివారిస్తాయి.

అదే సమయంలో మూత్రపిండాల పని తీరును మెరుగు పరుస్తాయి.బత్తాయి పండ్లను నిత్యం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య దూరం అవుతుంది.

హృదయ సంబంధ వ్యాధులు( Heart Problems ) వచ్చే రిస్క్ తగ్గుతుంది.

Telugu Tips, Latest, Mosambi Fruit, Mosambifruit, Season-Telugu Health

బ‌త్తాయి పండ్ల‌లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది.అందువ‌ల్ల బ‌త్తాయిని డైట్ లో చేర్చుకుంటే అజీర్తి, ప్రేగు కదలికలు, మలబద్ధకం వంటి సమస్యలు ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటాయి.ఇక‌ రోజుకు ఒక గ్లాస్ బత్తాయి రసం( Orange Juice ) తాగితే బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.

నీరసం, అలసట వంటివి దూరం అవుతాయి.మచ్చలు, మొటిమలు పోయి చర్మం కాంతివంతంగా సైతం మారుతుంది.

కాబట్టి ఈ సీజన్ లో దొరికే బత్తాయి పండ్లను అస్సలు వదిలిపెట్టకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube