ఇవి ఇంట్లో ఉంటే షాంపూ వాడాల్సిన అవసరం ఏముంది ?

Best Natural Replacements For Hair Shampoo

షాంపూ లేకుండా స్నానం చెయడం కష్టమైపోయింది ఈ కాలంలో.కాని షాంపూ వాడొద్దని డెర్మటాలాజిస్ట్లు చెబుతున్నారు.

 Best Natural Replacements For Hair Shampoo-TeluguStop.com

షాంపూకి బదులు సహజసిద్ధమైన వనరులతోనే జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని కొంతకాలంగా నిపుణులు చెబుతున్నారేమో కాని, మన ఇంట్లో బామ్మకి తెలియని విషయాల ఇవి ? సరే ఇప్పుడు షాంపూకి బదులుగా ఏం వాడితే బాగుంటుందో చూద్దాం.

* గంజి జుట్టుపై వాడటం వలన కూడా లాభాల్ని పొందవచ్చు తెలుసా.

గంజిలో ఉండే ఇనోసిటోల్ డ్యామేజ్ అయిన జుట్టుని బాగు చేస్తుంది.స్నానానికి ముందు గంజి జుట్టుకి పట్టి, ఓ అరగంట తరువాత కడిగేస్తే మంచిది.

* కలబంద ఆరోగ్యానికి చేయని సేవ లేదు.ఇది జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.అలాగే దురద లాంటి సమస్యలను దూరం చేస్తుంది.

షాంపూ కి బదులు అలోవేరా వాడటం వందరెట్లు మంచిది.

* ఆపిల్ సైడేడ్ వెనిగర్ అధ్బుతమైన క్లీనర్.

దీన్నే ఓ చిన్ని డబ్బాలో పోసుకొని రోజూ షాంపూలా వాడుకోవచ్చు.జుట్టుకి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలకు చికిత్స ఇది.

* కుంకుడుకాయ జుట్టుకి మంచిది అని కొత్తగా చెప్పాలా.జుట్టు సమస్యలకి చాలా పురాతనమైన వైద్యం ఈ కుంకుడు కాయ.ఇది జుట్టులో మాయిశ్చర్ ని ఉంచి, జుట్టు నిగనిగలాడేలా చేయడమే కాదు, జుట్టుని బలంగా, రాలిపోకుండా తయారుచేస్తుంది.

* జుట్టుకి కొబ్బరినూనె పట్టాలని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

కొబ్బరినూనె పట్టడం ఇబ్బందిగా అనిపించే యువతీయువకులు రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనె రాసుకొని ఉదయాన్నే తలస్నానం చేస్తే మంచిది.

* పొడవైన జుట్టు, బలమైన జుట్టు, మెరిసిపోయే జుట్టు .వీటి గురించి మీరు కలగంటే గుడ్డుని జుట్టుకి పట్టడం మర్చిపోవద్దు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube